Dussehra Holidays : దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
అక్టోబరు 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు(Dussehra Holidays) వెల్లడించారు.
- By Pasha Published Date - 04:39 PM, Thu - 19 September 24

Dussehra Holidays : దసరా పండుగ సెలవులు రాబోతున్నాయి. దసరా సందర్భంగా స్కూళ్లు, విద్యాసంస్థలకు అక్టోబర్ 2 నుంచి 14 వరకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి సెలవులు మొదలవుతాయి. ఆ తర్వాతి నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయి. అక్టోబరు 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు(Dussehra Holidays) వెల్లడించారు.
Also Read :India China Border : మూడు రోజులు మంచులో చిక్కుకున్న సైనికులు.. ఏమైందంటే.. ?
తెలంగాణలోని పలుప్రైవేట్ స్కూళ్లు అక్టోబర్ 1 నుంచే దసరా సెలవులు ఉంటాయని ఇప్పటికే ప్రకటించాయి. సెలవులు మొదలైతే ఊళ్లకు వెళ్లే వారితో బస్సులు, రైళ్లు కిటకిటలాడనున్నాయి. పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. ఇక రైల్వేశాఖ కూడా ప్రత్యేక రైళ్లను వేయనుంది. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఈ ప్రత్యేక రైలు, బస్సు సర్వీసులు నడుస్తాయి.
Also Read :Salman Khans Father: లారెన్స్ బిష్ణోయ్‌ని పిలుస్తా.. సల్మాన్‌ఖాన్ తండ్రికి మహిళ వార్నింగ్
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మే 25న విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. అందులో కూడా అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని స్పష్టంగా ప్రస్తావించింది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని తెలిపింది. ఇక వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 23 వరకు తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు కొనసాగుతాయి. 2025 ఫిబ్రవరి 28లోగా పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు పూర్తి అవుతాయి. 2025 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయి.
Also Read :Adani Group : ఏపీకి అదానీ గ్రూప్ రూ.25 కోట్ల సాయం
ఇటీవలే భారీ వర్షాల వల్ల తెలంగాణలో పాఠశాలలకు అనూహ్య హాలిడేస్ వచ్చాయి. సెప్టెంబరు 14, 15, 16 తేదీల్లో వరుస హాలిడేస్ లభించాయి. ఈనెల 17న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అంతేకాదు ఈనెలలో 22, 28, 29 తేదీల్లోనూ స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు. అంటే ఈసారి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పెద్దసంఖ్యలో పిల్లలకు హాలిడేస్ లభిస్తున్నాయన్న మాట. ఈనెల 20 నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో రాష్ట్రంలోని పలు చోట్ల స్కూళ్లకు మళ్లీ సెలవులను ప్రకటించే ఛాన్స్ ఉంది.