Salman Khans Father: లారెన్స్ బిష్ణోయ్‌ని పిలుస్తా.. సల్మాన్‌ఖాన్ తండ్రికి మహిళ వార్నింగ్
గతంలోనూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు(Salman Khans Father) పలుమార్లు వార్నింగ్స్ వచ్చాయి.
- By Pasha Published Date - 03:11 PM, Thu - 19 September 24

Salman Khans Father: ‘సరిగ్గా ప్రవర్తించడం తెలుసుకో. లేదంటే లారెన్స్ బిష్ణోయ్‌ని పిలుస్తా’ అంటూ ఓ గుర్తు తెలియని మహిళ తనను బెదిరించిందని బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ పేర్కొన్నారు. ఇవాళ ఉదయం టైంలో తమ ఇంటికి దగ్గర్లో వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఆ మహిళ తనకు వార్నింగ్ ఇచ్చిందన్నారు. తనకు ఈ హెచ్చరికలు ఇచ్చిన మహిళ బుర్ఖా ధరించి ఉందని తెలిపారు. దీనిపై బాంద్రా పోలీసులకు సలీమ్‌ఖాన్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సల్మాన్‌ఖాన్ ఇవాళ ఉదయమే ముంబై నుంచి ఫారిన్ టూర్‌కు బయలుదేరి వెళ్లారు. సరిగ్గా సల్మాన్ ఇంట్లో లేని టైంలోనే సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెదిరింపులు రావడం గమనార్హం. గతంలోనూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు(Salman Khans Father) పలుమార్లు వార్నింగ్స్ వచ్చాయి.
Also Read :Jungle Raj : దళిత కాలనీలో 80 ఇళ్లకు నిప్పు.. భూవివాదంతో తీవ్ర ఉద్రిక్తత
- ఈ ఏడాది ఏప్రిల్ 14న తెల్లవారుజామున 4.55 గంటలకు పలువురు దుండగులు బైక్‌పై వచ్చి సల్మాన్‌ఖాన్ ఇంటిపై తుపాకులతో ఫైరింగ్ చేశారు. మొదటి అంతస్తు బాల్కనీ లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయి.
- ఈ కేసును ముంబై పోలీసులు సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపి, 1700కుపైగా పేజీలతో ఛార్జ్‌షీట్‌ను తయారు చేశారు.
- ఏప్రిల్ 14న ఇంటిపై కాల్పులు జరిగిన టైంలో సల్మాన్ ఖాన్ ఇంట్లోనే నిద్రిస్తున్నారు. తుపాకీ తూటాల శబ్దం విని ఆయన నిద్ర నుంచి మేల్కొన్నారు.
- అనంతరంబాడీగార్డ్ వెళ్లి సల్మాన్ ఖాన్‌కు ఈవిషయాన్ని చెప్పారు.
- తనను, తన ఫ్యామిలీని మర్డర్ చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నిందంటూ అప్పట్లో సల్మాన్ ఖాన్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఆ కుట్రలో భాగంగానే తమ ఇంటిపై కాల్పులు జరిగి ఉండొచ్చని సల్లూభాయ్ ఆనాడు ఆరోపించారు.
- ఈ ఘటనపై దర్యాప్తు జరిగే క్రమంలో పోలీసు లాకప్‌లో ఓ నిందితుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది.