HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Do You Hit With A Shoe Minister Ktr Open Challenge On Drugs Case

KTR: చెప్పుతో కొట్టుకుంటావా..? డ్రగ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ హస్తం కూడా ఉందని ప్రతిపక్ష, విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్నాయి.

  • Author : Anshu Date : 20-12-2022 - 7:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1112414 Ktr News
1112414 Ktr News

బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ హస్తం కూడా ఉందని ప్రతిపక్ష, విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా కేటీఆర్‌ టార్గెట్‌గా విమర్శలు చేస్తోన్నాయి. కేటీఆర్‌కు కూడా డ్రగ్స్ పరీక్షలు చేయాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష, విపక్ష పార్టీల విమర్శలపై కేటీఆర్ ఎట్టకేలకు స్పందించారు.

తాను డ్రగ్స్ టెస్టులకు సిద్దమని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తన జుట్టు, గోర్లతో పాటు అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తానని, డ్రగ్స్ టెస్టులు చేయించుకోవచ్చని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలితే కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలకు సిద్దమా? అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలితే బండి సంజయ్‌ను చెప్పుతొ కొడతానని, తన సవాల్‌ను ఆయన స్వీకరిస్తారా అంటూ ప్రశ్నించారు.

డ్రగ్స్ టెస్టు కోసం తాను ఎప్పుడైనా సిద్దమని, ఏది కావాలంటే అది ఇస్తానని కేటీఆర్ తెలిపారు. ‘డాక్టర్లను తీసుకొచ్చి డ్రగ్స్ టెస్ట్ చేయించండి బండి సంజయ్.. నాకు క్లీన్ చిట్ వస్తుంది. బండి సంజయ్ తన చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా’ అంటూ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారని, నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు.

బెంగళూరు డ్రగ్స్ కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో గత రెండు రోజులుగా ఆయన ఈడీ ముందు విచారణకు హాజరవుతున్నారు. తన బ్యాంక్ డాక్యుమెంట్స్, తన కుటుంబసభ్యుల బ్యాంకు వివరాలతో విచారణకు హాజరువుతున్నారు.దీంతో మంత్రి కేటీఆర్‌కు కూడా త్వరలో డ్రగ్స్ కేసులో నోటీసులు వస్తాయనే ప్రచారం జరుగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drugs case
  • ktr

Related News

Moinabad Farmhouse Drugs Tdp Eluru Mp Putta Mahesh Kumar Yadav

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

TDP MP Putta Mahesh  మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు. మొయిన

  • MP Putta Mahesh Kumar

    డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌పై కుట్ర జ‌రుగుతుందా?!

  • Ktr Velugumatla Demolition

    Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

Latest News

  • China vs Taiwan : తైవాన్ సమీపంలో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తోన్న చైనా

  • R Narayana Murthy : నక్సలైట్ గా మారిన పీపుల్స్ స్టార్

  • LPG Shortage : ఐటీ క్యాంటిన్ మూసేస్తున్నాం.. వర్క్ ఫ్రం హోం తీసుకోండి

  • Fire Accident : SCB మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

  • పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd