HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Do Not Make These Mistakes While Casting Mlc Elections Vote Andhra Pradesh And Telangana Mlc Polls

MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి

మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రానికి తప్పకుండా గుర్తింపు కార్డు, ఓట‌రు స్లిప్(MLC Vote) తీసుకెళ్లండి. 

  • By Pasha Published Date - 02:31 PM, Wed - 26 February 25
  • daily-hunt
Mlc Elections Vote Ap Mlc Polls Telangana Mlc Polls Mlc Vote

MLC Vote : తెలుగు రాష్ట్రాల్లో రేపు (ఫిబ్రవరి 27న) ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. లక్షలాది మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అయితే ప్రతీసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణం ఓటర్లకు పోలింగ్‌ పద్ధతిపై సరైన అవగాహన లేకపోవడమే. అందుకే మనం ఈ కథనంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే పద్ధతి గురించి తెలుసుకుందాం..

Also Read :GV Reddy : జీవీ రెడ్డికి టీడీపీ బిగ్ ఆఫర్.. ఏమిటి ? ఎందుకు ?

ఎమ్మెల్సీ ఓటు వేయడం ఇలా..

  • మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రానికి తప్పకుండా గుర్తింపు కార్డు, ఓట‌రు స్లిప్(MLC Vote) తీసుకెళ్లండి.
  • పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓట‌రు లిస్టులోని మీ పేరు, సీరియ‌ల్ నంబర్ వివరాలను చెక్ చేయండి. మీ పేరు వ‌ద్ద సంత‌కం చేయండి.
  • ఆ తర్వాత పోలింగ్ అధికారులు మీకు బ్యాలెట్ పేప‌ర్‌ను అందిస్తారు. పెన్ ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే ఓటేయాలి.
  • బ్యాలెట్ పేప‌ర్‌లో అభ్య‌ర్థుల క్ర‌మ‌ సంఖ్య‌లు, వారి పేర్లు, ఫొటోలు వరుసగా ఉంటాయి. పార్టీల గుర్తులు కానీ, వాటి సింబల్స్ కానీ ఉండ‌వు.
  • బ్యాలెట్ పేప‌ర్‌లో మీకు ఇష్ట‌మైన అభ్య‌ర్థి పేరు ఎదుటనున్న ఖాళీ బాక్స్‌లో “1” అని నంబ‌ర్ వేయాలి.
  • మిగిలిన వారికి 2, 3, 4, 5 ఇలా ఎంత మంది ఉంటే అంత‌మందికి నంబ‌ర్‌లో మీరు ప్రాధాన్య‌త నంబర్లు వేయొచ్చు.
  • చివరగా అధికారులు సూచించిన‌ విధంగా ఆ బ్యాలెట్ పేప‌ర్‌ను మ‌డ‌త పెట్టి, బాక్సులో వేయాలి.

Also Read :UPI Lite : ‘యూపీఐ లైట్‌’ వాడుతున్నారా ? కొత్త ఆప్షన్ గురించి తెలుసుకోండి

ఇవి అస్సలు చేయొద్దు

  • బ్యాలెట్ పేప‌ర్‌లో ఉన్న అభ్య‌ర్థులు అందరికీ ఒకటే నంబ‌ర్ వేయొద్దు. ఒకరికి వేసిన నంబరు మరొకరికి వేయకూడదు.
  • ప్రాధాన్య‌త‌ నంబరును ఇంగ్లీష్ భాషలో కానీ, రోమన్ నంబరులో కానీ వేయొద్దు. కేవలం అంకెల్లోనే రాయాలి.
  • బ్యాలెట్ పేప‌ర్‌ను ఇష్టం వచ్చినట్టుగా మ‌డ‌త పెడితే, మీరు రాసిన ప్రాధాన్య‌త అంకెలు ఇంకొక‌రి ఎదురుగా ప‌డ‌తాయి. అలాంటి ఓట్లు చెల్లవు.
  • ప్రాధాన్య‌త అంకె వేయ‌కుండా ఖాళీ బ్యాలెట్ పేప‌ర్ వేయ‌కూడ‌దు.
  • ఓటు వేసేట‌ప్పుడు పెన్నుతో గ‌ట్టిగా రుద్దకూడదు. చుక్కలు, టిక్కులు పెట్టొద్దు.
  • అభ్య‌ర్థి పేరు, బాక్స్ ప‌క్క‌న మాత్రమే ప్రాధాన్యత అంకె  వేయాలి.
  • 1వ ప్రాధాన్య‌త నంబరు ఇవ్వ‌కుండా, ఆ తర్వాతి అంకెలు వేస్తే ఓటు చెల్ల‌దు.
  •  అంకెలు కాకుండా సున్నాలు చుట్టడం, ✔️ పెట్టడం లాంటివి చేయొద్దు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP MLC polls
  • mlc elections
  • MLC Elections Vote
  • MLC polls
  • MLC Vote
  • telangana
  • Telangana MLC Polls

Related News

Sadar Sammelan

Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.

  • Bandh Effect

    BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Kavitha Bc Bandh

    BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

Latest News

  • India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

  • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd