GV Reddy : జీవీ రెడ్డికి టీడీపీ బిగ్ ఆఫర్.. ఏమిటి ? ఎందుకు ?
వీటిని చూసి జీవీ రెడ్డికి(GV Reddy) టీడీపీ హైకమాండ్ పెద్ద ఆఫరే ఇచ్చేందుకు రెడీ అయిందట.
- By Pasha Published Date - 01:48 PM, Wed - 26 February 25

GV Reddy : టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పేరు.. జీవీ రెడ్డి. ఎందుకంటే ఆయన ఏకకాలంలో ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీలో ఎమర్జింగ్ యువనేతగా చాలా తక్కువ టైంలోనే మంచిపేరును జీవీ రెడ్డి సంపాదించుకున్నారు. టీడీపీ భవిష్యత్ సారథి నారా లోకేశ్‌కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు మద్దతుగా టీడీపీ సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెటిజన్లు పోస్ట్‌లు, కామెంట్లు పెడుతున్నారు. జీవీ రెడ్డి లాంటి అంకితభావం, నిబద్ధత కలిగిన యువనేత విషయంలో టీడీపీ పెద్దలు వ్యవహరించిన తీరును ఎంతోమంది నెటిజన్లు తప్పుపట్టారు. వీటిని చూసి జీవీ రెడ్డికి(GV Reddy) టీడీపీ హైకమాండ్ పెద్ద ఆఫరే ఇచ్చేందుకు రెడీ అయిందట. అదేమిటో తెలుసుకుందాం..
Also Read :UPI Lite : ‘యూపీఐ లైట్’ వాడుతున్నారా ? కొత్త ఆప్షన్ గురించి తెలుసుకోండి
ఆఫర్ సరే.. జీవీరెడ్డి స్పందనేంటి ?
టీడీపీ హైకమాండ్ నుంచి పలువురు జీవీ రెడ్డితో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. తిరిగి పార్టీలోకి రావాలని వారు ఆయన్ను బుజ్జగించినట్లు సమాచారం. టీడీపీ క్యాడర్ కోరిక మేరకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని జీవీ రెడ్డికి హామీ ఇచ్చారని అంటున్నారు. అవసరమైతే ఫ్యూచర్‌లో ఎమ్మెల్సీ చేస్తామని జీవీరెడ్డితో పార్టీ పెద్దలు చెప్పారట. అయితే దీనిపై జీవీరెడ్డి ఎలా స్పందించారు ? తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, టీడీపీలో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు అంగీకరించారా ? అనేది తెలియరాలేదు. ఈ అంశంపై త్వరలోనే మీడియా వేదికగా జీవీరెడ్డి ఏదైనా చెప్పే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Also Read :Ramya Krishna and Krishna Vamsi’s Divorce : రమ్యకృష్ణ కు విడాకులు క్లారిటీ ఇచ్చిన వంశీ
నారా లోకేశ్ చొరవ..
ఈ వార్తలను బట్టి ఒక విషయం స్పష్టం అవుతోంది. అదేమిటంటే.. ఆయనకు మళ్లీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవిని ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని ఇప్పటికే ఇతరులతో భర్తీ చేశారు. అంతకంటే బెటర్ పదవే ఇస్తామని జీవీరెడ్డికి స్పష్టమైన హామీ లభించింది. మంత్రి నారా లోకేశ్ చొరవ చూపి ఈ దిశగా చర్చలు జరిపించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బలమైన నేతలను టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు అనే సంకేతాలను పార్టీ క్యాడర్‌లోకి పంపేందుకే, చర్చలు జరిపి మరీ జీవీ రెడ్డిని వెనక్కి తీసుకొస్తున్నారని అంటున్నారు.