HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Discussion In Telangana Assembly On Conocarpus Trees Why What Happened

Conocarpus Trees: కోనోకార్పస్ చెట్లపై అసెంబ్లీలో చర్చ.. ఎందుకు ? ఏమైంది ?

కోనోకార్పస్(Conocarpus Trees) జాతి మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఎక్కడపడితే అక్కడ పెరుగుతాయి. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు.

  • By Pasha Published Date - 10:41 AM, Tue - 1 April 25
  • daily-hunt
Conocarpus Trees Hyderabad Telangana Assembly Speaker Gaddam Prasad Kumar

Conocarpus Trees: బీఆర్ఎస్ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో కోట్లాది మొక్కలను నాటారు. వీటిలో పెద్ద సంఖ్యలో కోనోకార్పస్ మొక్కలు కూడా ఉన్నాయి.  వీటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవలే అసెంబ్లీ వేదికగా కోరారు. ఈ చెట్లను పెంచొద్దని 2022లోనే తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ పరిధిలో కోనోకార్ప‌స్ మొక్క‌ల పెంపకంపై 2022 మే నెలలో జీహెచ్‌ఎంసీ బ్యాన్ విధించింది. అయినా వీటి తొలగింపుపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. ఇంతకీ ఎందుకు ? కోనోకార్పస్ మొక్కలు, చెట్లతో వచ్చే సమస్య ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం.

Also Read :Imran Khan : నోబెల్‌శాంతి పురస్కారానికి ఇమ్రాన్‌ పేరు.. తెర వెనుక జెమీమా!

కోనోకార్పస్ చెట్ల గురించి..

  • కోనోకార్పస్ చెట్లు శంఖు ఆకారంలో పచ్చగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
  • హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరం పరిధిలోని డివైడర్లు, పార్కులలో ఈ మొక్కలను నాటారు.
  • కోనోకార్పస్ అనేవి అమెరికా ఖండంలోని తీర ప్రాంతాలకు చెందిన మాంగ్రూవ్ జాతి మొక్కలు.
  • కోనోకార్పస్(Conocarpus Trees) జాతి మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఎక్కడపడితే అక్కడ పెరుగుతాయి. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు.
  • భారత్, పాకిస్తాన్, అరబ్ దేశాలు, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఈ చెట్లను పెద్దసంఖ్యలో పెంచారు. ఎడారి ప్రాంతాల్లో దుమ్ము, ఇసుక తుఫానులు ఎక్కువ. వాటిని అడ్డుకునేందుకు ఈ చెట్లను పెంచారు. కాలక్రమంలో వీటి దుష్ప్రభావాల గురించి తెలియడంతో,  తొలగించే దిశగా అడుగులు వేశారు. దుబాయ్‌లో అయితే ఈ చెట్లను వేళ్లతో సహా పెకిలించారు.

Also Read :MLC Election: హైదరాబాద్‌ ‘లోకల్’ ఎమ్మెల్సీ.. గెలుపు ఆ పార్టీదే

  • ఈ చెట్లు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి.
  • కోనోకార్పస్ చెట్ల వేర్లు బలంగా ఉండి, భూగర్భంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. దీనివల్ల నీటి పైప్‌లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర నిర్మాణాలు దెబ్బతింటాయి.
  • ఈ చెట్లు భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తాయని అరబ్ దేశాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో గుర్తించారు.
  • ఈ చెట్ల వల్ల భవనాలు, నిర్మాణాలకు నష్టం జరుగుతుందని  ఇరాక్‌లోని మిసాన్ ప్రావిన్స్‌లో జరిగిన అధ్యయనంలో గుర్తించారు.
  • కోనోకార్పస్ చెట్టు పువ్వు నుంచి వెలువడే రేణువులు యమ డేంజర్. వీటి వల్ల మనుషులకు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఈ మొక్కలకు బదులుగా చింత, వేప, మర్రి వంటి మొక్కలను నాటాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read :Mahesh Kumar Goud : ఇరగదీసిన టీపీసీసీ చీఫ్‌.. కరాటే బ్లాక్‌బెల్ట్‌ డాన్‌ 7తో తడాఖా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Conocarpus Trees
  • gaddam prasad kumar
  • hyderabad
  • telangana
  • Telangana Assembly
  • Telangana Assembly Speaker

Related News

Bandh Effect

BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

BC Bandh in Telangana : పోలీసులు బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టగా, వ్యాపార వర్గాలు మాత్రం పండుగ సమయానికి ఇలాంటి రాజకీయ ఆందోళనలు ప్రజల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అంటున్నారు

  • Gold Price Aug20

    Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • Kavitha Bc Bandh

    BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

Latest News

  • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

  • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

  • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

  • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd