MLC Election: హైదరాబాద్ ‘లోకల్’ ఎమ్మెల్సీ.. గెలుపు ఆ పార్టీదే
ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ స్థానాన్ని(MLC Election) భర్తీ చేస్తున్నారు.
- By Pasha Published Date - 08:13 AM, Tue - 1 April 25

MLC Election: తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానం భర్తీ కాబోతోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 4న నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 7న నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఈ స్థానం ఎవరికి దక్కబోతోంది ? ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్న రాజకీయ పార్టీలు ఏవి ? అనేది చూద్దాం..
Also Read :Earthquake : భద్రాచలం లో భూకంపం వచ్చే ఛాన్స్..?
మొత్తం 110 ఓట్లు
ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ స్థానాన్ని(MLC Election) భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో బలంగా ఉన్న పార్టీకే ఈ సీటు దక్కుతుంది. ఈ సీటు పరిధిలో మొత్తం 110 ఓట్లు ఉన్నాయి. వాటిలో 81 ఓట్లు కార్పొరేటర్లవే. 29 మంది ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఉన్న 3 డివిజన్లకు కార్పొరేటర్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కలను బట్టి ఒక విషయం క్లియర్ అవుతోంది. అత్యధిక సంఖ్యలో కార్పొరేటర్లను కలిగిన పార్టీకే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కైవసం అవుతుంది.
Also Read :Dasaradha Rama Reddy : పురస్కారం అందుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీ తేతలి దశరథరామా రెడ్డి
హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ స్థానంలో బలాబలాలు
- ఈ స్థానం పరిధిలో మొత్తం 81 మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో 40 మంది మజ్లిస్ పార్టీవారే. 1 ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీలు కూడా ఈ పార్టీకి ఉన్నారు.
- ఈ స్థానం పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి 1 5మందే కార్పొరేటర్లు ఉన్నారు. ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మె ల్సీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
- ఈ స్థానం పరిధిలో బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ కూడా ఉన్నారు.
- ఈ స్థానం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు కార్పొరేటర్లు ఉన్నారు. 1 రాజ్యసభ ఎంపీ, నలుగురు ఎమ్మె ల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
విజయం ఎవరికి ?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో అత్యధికంగా 49 ఓట్లు మజ్లిస్ పార్టీకే ఉన్నాయి. ఈ పార్టీకి పరోక్షంగా కాంగ్రెస్ మద్దతు కూడా ఉంది. దీంతో ఈ స్థానంలో మజ్లిస్ పార్టీ ప్రతిపాదించే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ. బీఆర్ఎస్ ,కాంగ్రెస్‌లు మజ్లిస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకొని, తమ పార్టీల అభ్యర్థులను బరిలోకి దింపడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 25న ఫలితాలు వస్తాయి.