HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Deputy Cm Bhattis Key Comments On The Bharat Summit

Deputy CM Bhatti: భారత్ సమ్మిట్‌పై డిప్యూటీ సీఎం భ‌ట్టి కీల‌క వ్యాఖ్య‌లు!

భారత్ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ దిశా నిర్దేశం చేస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసిసి నోవాటేల్లో జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు.

  • Author : Gopi Date : 25-04-2025 - 8:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Employees
Employees

Deputy CM Bhatti: భారత్ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ దిశా నిర్దేశం చేస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసిసి నోవాటేల్లో జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రపంచంలో కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో ప్రపంచం మొత్తం రెండు కూటములుగా విడిపోయిన సమయంలో కొన్ని దేశాలతో కలిసి ఆనాటి ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ అలీన విధానాన్ని తీసుకొని ప్రపంచానికి దిశా నిర్దేశం చూపారని అన్నారు.

సుదీర్ఘకాలం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అహింస సత్యం సామాజిక న్యాయం అనే మూడు ప్రాథమిక మూల సిద్ధాంతాలతో మరోసారి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారత్ సమ్మిట్ ద్వారా దిశా నిర్దేశం చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల ఆధారంగా భారత్ సమ్మిట్ జరుగుతున్నదని, ఈ సమ్మిట్ లో శాంతి కాముకులు, ప్రపంచ న్యాయం కోరుకునేవారు( గ్లోబల్ జస్టిస్) ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగిన వారు 8 ప్యానెల్స్ గా చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు.

100 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు లింగ న్యాయం, ఫెమినిస్ట్ ఫ్యూచర్, ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్, కౌంటరింగ్ డిస్ ఇన్ఫర్మేషన్, యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో, షేవింగ్ న్యూ మల్టీ ల్యాటరీజం వంటి అంశాలపై లోతుగా చర్చలు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాదులో నిర్వహించే భారత్ సమ్మిట్ కార్యక్రమం చారిత్రాత్మకమైన సమ్మిట్ గా నిలిచిపోతుందని అభివర్ణించారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం గురించి భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధిని మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నామో ప్రపంచ ప్రతినిధులకు వివరించామని వెల్లడించారు.

క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, రీజినల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఏర్పాటు చేస్తున్న క్లస్టర్స్, ఫ్యూచర్ సిటీ, మూసి పునర్జీవం, నాలెడ్జ్ ఐటీ సెంటర్, ఇందిరా గిరి జల వికాసం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాల గురించి భారత్ సమ్మిట్ హాజరైన ప్రతినిధులకు వివరించామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమం పట్ల ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు. దేశానికే మోడల్ గా నిలవబోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ప్రతినిధులను కోరినట్లు చెప్పారు. అదేవిధంగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న గ్లోబల్ జస్టిస్ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ఈ సమ్మిట్ కు హాజరైన ప్రతినిధులు స్వాగతించి, అభినందించారని వెల్లడించారు.

Also Read: Pregnancy: ప్రెగ్నెన్సీ టైమ్‌లో శృంగారం చేయ‌డం మంచిదేనా?

జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు నిరసనగా, బాధితులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు హైదరాబాదులో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొంటామని భారత్ సమ్మిట్ కు హాజరైన ప్రతినిధులు తెలిపారని ఈ సందర్భంగా చెప్పారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశం కోసం అందరం ఒక్కటై నిలబడదామని పిలుపునిచ్చారు. శాంతి, అహింసా మార్గంలో గ్లోబల్ జస్టిస్ కోసం కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat Summit
  • Deputy CM Bhatti
  • hyderabad
  • Novotel
  • telangana

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd