HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Delta Air Lines Investments In Telangana Minister Sridhar Babu

Delta Airlines : అమెరికాలో మంత్రుల పర్యటన.. ఆ కంపెనీ నుంచి తెలంగాణకు పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు డెల్టా ఎయిర్‌లైన్స్ రెడీ అయింది.

  • Author : Pasha Date : 08-06-2024 - 4:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delta Airlines
Delta Airlines

Delta Airlines :  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు డెల్టా ఎయిర్‌లైన్స్ రెడీ అయింది. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ అట్లాంటాలోని డెల్టా ఎయిర్ లైన్స్ కార్యాలయానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌తో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అన్ని రకాల  సౌకర్యాలు  కల్పిస్తుందని ఈసందర్భంగా శ్రీధర్ బాబు డెల్టా ఎయిర్‌లైన్స్  కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిన తీరును వివరిస్తూ ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రజెంటేషన్‌పై సంతృప్తివ్యక్తం చేసిన కృష్ణకుమార్, డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల టీమ్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమాన సర్వీసును నడపాలని ఈసందర్భంగా డెల్టా ఎయిర్ లైన్స్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌‌ను తెలంగాణ మంత్రులు కోరారు. అట్లాంటా నుంచి నేరుగా విమానాలు లేకపోవడంవల్ల అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధులు.. హైదరాబాద్‌కు నేరుగా విమానాలు నడిపేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డెల్టా ఎయిర్ లైన్స్(Delta Airlines) ప్రతినిధుల స్పందన పట్ల మంత్రులు శ్రీధర్ బాబు,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also Read : Leader of Opposition : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. సీడబ్ల్యూసీ తీర్మానం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delta Airlines
  • KomatiReddy Venkat Reddy
  • Minister Sridhar Babu
  • telangana

Related News

Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారు

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

Latest News

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

  • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

  • Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd