Family Survey Data: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి: రాష్ట్ర నోడల్ అధికారి
శనివారం హైదరాబాద్ షేక్ పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు చేపట్టిన శిక్షణా శిబిరంలో రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డేటా ఎంట్రీ నమోదు విధివిదానాలపై వివరించారు.
- By Gopichand Published Date - 08:40 PM, Sat - 16 November 24

Family Survey Data: సమగ్ర కుటుంబ సర్వే డేటా (Family Survey Data) ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలని రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌కు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 50 శాతం ఇంటింటా సర్వే జరిగినట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికిపైగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నియామకం జరిగినట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు లాగిన్, శిక్షణలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు దిశానిర్దేశం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా నమోదును ఎలాంటి తప్పులు లేకుండా బాధ్యతాయుతంగా చేయాలని శిక్షణకు హాజరైన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ జిల్లా అనుదీప్ దురిశెట్టి సూచించారు.
శనివారం హైదరాబాద్ షేక్ పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు చేపట్టిన శిక్షణా శిబిరంలో రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డేటా ఎంట్రీ నమోదు విధివిదానాలపై వివరించారు. తదుపరి సిసిజీ డేవలపర్ జెల్ల లోకేష్, సిజిజి సిబ్బంది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నమోదు చేసిన ఫారంల ద్వారా శిక్షణలో క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
Also Read: Meenakshi Chaudhary : అక్కినేని హీరోతో మీనాక్షి పెళ్లి.. హీరోయిన్ స్పందన ఇది..!
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఎంట్రీ నమోదుకు లాగిన్ ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడ శిక్షణ పొంది ఆపరేటర్లకు జిల్లాలోని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ అందించేందుకు ఈ శిక్షణ ఎంతో కీలకమని అన్నారు. ఈ శిక్షణలో వివిధ జిల్లాలు, జిహెచ్ఎంసి నుండి దాదాపు 300 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మెరుగైన శిక్షణ అందించనున్నారని తెలిపారు. డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా తప్పులు లేకుండా పక్కాగా చేపట్టాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 50శాతం పైగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని, అలాగే కొన్ని జిల్లాలో 70 శాతం వరకు సర్వే జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎన్యూమనేటర్లకు ప్రజలు సహకరిస్తున్నారని, సర్వే వేగవంతంగా జరుగుతుందని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అర్థ గణాంక శాఖ సంచాలకులు ఓం ప్రకాష్, ప్రణాళిక శాఖ సంచాలకులు రూఫస్ దత్తం, సీసీజీ ప్రాజెక్టు మేనేజర్ జెల్ల లోకేష్ లోకేష్, ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.