Meenakshi Chaudhary : అక్కినేని హీరోతో మీనాక్షి పెళ్లి.. హీరోయిన్ స్పందన ఇది..!
Meenakshi Chaudhary సుశాంత్ ఈ విషయంపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ మీనాక్షి చౌదరి మాత్రం వస్తున్న ఈ వార్తలపై స్పందించింది. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల మీద మాత్రమే ఉంది.
- By Ramesh Published Date - 08:33 PM, Sat - 16 November 24

హీరో హీరోయిన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని వాళ్లిద్దరు మళ్లీ ఒకటి రెండుసార్లు కాస్త క్లోజ్ గా కనిపిస్తే చాలు వారిద్దరికీ ఆఫ్ స్క్రీన్ రిలేషన్ ఉందని ఎలాంటి కన్ ఫర్మేషన్ లేకుండానే వార్తలుర్ రాసేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఒక క్రేజీ రూమర్ తెలుగు మీడియా సర్కిల్ లో వైరల్ గా మారింది. అదేంటి అంటే అక్కినేని నాగార్జున (Nagarjuna) మేనల్లుడు సుశాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్న మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)తో ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారని న్యూస్ వైరల్ అయ్యింది.
అక్కినేని హీరో సుశాంత్ ఈ విషయంపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ మీనాక్షి చౌదరి మాత్రం వస్తున్న ఈ వార్తలపై స్పందించింది. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల మీద మాత్రమే ఉంది. తాను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని ఆమె అన్నది. సో తనపై వస్తున్న ఈ వార్తలకు చెక్ పెడుతూ మీనాక్షి ఇచ్చిన ఈ క్లారిటీ వల్ల అందరు రిలాక్స్ అయ్యారు.
లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్..
సుశాంత్ (Sushanth) తో మీనాక్షి ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. దీవాళికి లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి రీసెంట్ గా వరుణ్ తేజ్ మట్కాతో ఫ్లాప్ చవిచూసింది.
ఐతే తన పెళ్లిపై వస్తున్న ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది మీనాక్షి. తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉంటే అప్పుడు తానే స్వయంగా చెబుతానని అంటుంది అమ్మడు. మొత్తానికి మీనాక్షి క్లారిటీతో ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది.