HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Courts Sensational Decision On Nizams Properties

Nizam’s properties : నిజాం ఆస్తులపై కోర్టు సంచలన నిర్ణయం

  • Author : Vamsi Chowdary Korata Date : 24-10-2025 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NIzam
NIzam

ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన రాజమహళ్ల పంపకాల వివాదంలో ఆయన వారసులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆస్తుల పంపకాలపై దాఖలైన దావాను కొట్టివేయాలని కోరుతూ ఎనిమిదో నిజాంగా గుర్తింపు పొందిన ముఖరం జా కుమారుడు అజ్మత్ జా, కుమార్తె షెకర్ జా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో అసలు కేసులో పూర్తిస్థాయి విచారణకు మార్గం సుగమమైంది.

ఏడో నిజాం మనవళ్లలో ఒకరైన నవాబ్ నజఫ్ అలీ ఖాన్, తన తాత ఆస్తులను వారసులందరికీ పంచాలని కోరుతూ 2021లో ఈ దావా వేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్, పురానీ హవేలీ, కింగ్ కోఠి ప్యాలెస్‌తో పాటు ఊటీలోని హేర్‌వుడ్ అండ్ సెడార్స్ బంగ్లా వంటి ఐదు చారిత్రక ఆస్తుల పంపకం జరగాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆస్తుల ప్రస్తుత విలువ రూ.10,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

ఈ కేసును విచారణకు స్వీకరించవద్దని అజ్మత్ జా, షెకర్ జా కోర్టును ఆశ్రయించారు. అయితే నజఫ్ అలీ ఖాన్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, ఏడో నిజాం చట్టబద్ధమైన వారసుడిగా పిటిషనర్‌కు పూర్వీకుల ఆస్తులపై హక్కు ఉందని తెలిపారు. ఆస్తుల యాజమాన్యం, వాస్తవాధీనం, విలువ వంటి అంశాలను పూర్తిస్థాయి విచారణ ద్వారానే తేల్చగలమని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసి, అసలు దావా విచారణకు అనుమతించింది.

1967 ఫిబ్రవరి 24న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణించిన తర్వాత, భారత ప్రభుత్వం ఆయన మనవడు ముఖరం జాను వారసుడిగా గుర్తించింది. అయితే, నిజాం ప్రైవేట్ ఆస్తులను ఇస్లామిక్ షరియత్ చట్టం ప్రకారం ఆయన 34 మంది సంతానానికి సమానంగా పంచాలని, కేవలం ఒకే వ్యక్తి ఆస్తులను అనుభవించడం సరికాదని నజఫ్ అలీ ఖాన్ వాదిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 232 మంది ప్రతివాదులుగా ఉండగా, వారిలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ కూడా ఉంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nizam
  • Nizam properties
  • telangana
  • TS High Court

Related News

Apolo Tg

తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

రాష్ట్రవ్యాప్తంగా తన 1,000వ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, ఈ ఘనతను సాధించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ఈ కొత్త స్టోర్‌ను లాంఛనంగా ప్రారంభించారు

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

  • Telangana Hpv Vaccine

    HPV Vaccine : తెలంగాణ లో ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

  • New Buyers

    తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

  • Revanth Local Body Election

    Record in CM Revanth : సీఎం రేవంత్ ఖాతాలో అరుదైన రికార్డు

Latest News

  • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

  • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

  • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

  • పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్

  • Delhi Liquor Case : చట్టపరంగా మంచోళ్ళు.. మరి ప్రజల దృష్టిలో ?

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd