HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Wins Thorrur Janagama In Lucky Draw

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

  • Author : Vamsi Chowdary Korata Date : 17-02-2026 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jangaon Thorrur Congress
Jangaon Thorrur Congress

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎంపిక చేశారు.

  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
  • ‘లక్కీ డ్రా’ ద్వారా మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక
  • రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను వరించిన అదృష్టం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఉద్రికతల మధ్య కొనసాగుతోంది. సోమవారం 7 కార్పొరేషన్లకు, 105 మున్సిపాలిటీలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. కోరం లేకపోవటం, ఇతర అనివార్య కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నేటికి వాయిదా పడగా.. నేడు ఎన్నిక నిర్వహించారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ‘అదృష్టం’ వరించింది. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు.

జనగామ మున్సిపాలిటీని అధికార కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికను నిర్వహించగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫిషియో ఓట్లు వేసిన తర్వాత కూడా రెండు పార్టీలకు కూడా సమానంగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి బాలమణికి మొత్తం 16 ఓట్లు రాగా…బీఆర్ఎస్ పార్టీ చైర్మెన్ అభ్యర్థి గోపగాని సుగుణాకర్ సైతం 16 ఓట్లు వచ్చాయి. దీంతో నిబంధనల ప్రకారం అధికారులు డ్రా వేశారు. ఇద్దరి పేర్లు రాసి డ్రా తీశారు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణి పేరు రావటంతో ఆమెను ఛైర్మన్‌గా ప్రకటిస్తూ అధికారులు ధృవీకరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ముందు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆందోళన చేపట్టారు. వైస్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

ఇక తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొర్రూరులో మెుత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక్కడ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే తేజస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య రిజస్టర్ చేసుకున్నారు. వారు ఓట్లు కూడా కలుపుకొని కాంగ్రెస్ బలం 9కి చేరింది. ఇవాళ ఎన్నిక నిర్వహించగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు సమానంగా చెరో 9 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్‌ను ఎంపిక చేశారు. 2వ వార్డు కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ డ్రాలో విజయం సాధించి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రిటర్నింగ్ అధికారులుఅధికారిక పత్రం అందజేశారు.

ఇక డోర్నకల్, జహీరాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం బీఆర్ఎస్ ఖాతాలో చేరగా.. ఇబ్రహీంపట్నం కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే చేరింది. అయితే ఇక్కడి ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Jangaon
  • lucky draw
  • Municipal Chairman
  • Telangana Municipal Election Results
  • telangana municipal elections 2026
  • thorrur
  • Thorrur Municipal Election Results

Related News

Errabelli Dayakar Rao

కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

Errabelli Dayakar Rao  తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డ

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

  • High Tension In Thorrur Over Municipal Seat Chairman

    తొర్రూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద హై టెన్షన్..

  • Bigshock

    TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

  • Telangana Municipal Results

    మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా.. బీఆర్ఎస్, బీజేపీ ?

Latest News

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ గందరగోళంపై కేంద్రమంత్రి క్షమాపణలు

  • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

Trending News

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd