HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nampally Court Issues Summons To Allu Arjun To Appear In Court

Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 20-06-2026 - 10:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nampally Court issues summons to Allu Arjun to appear in court.
Nampally Court issues summons to Allu Arjun to appear in court.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన సోమవారం నాడు న్యాయస్థానం ముందు స్వయంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్నానని, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా తనకు ఆన్‌లైన్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అల్లు అర్జున్ కోర్టును అభ్యర్థించారు. అయితే, ఆయన దాఖలు చేసిన ఈ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. మొదటి విచారణకు నిందితులు లేదా సంబంధిత వ్యక్తులు స్వయంగా హాజరుకావాలనే నిబంధనను ఉటంకిస్తూ, కోర్టుకు రావడం మినహా వేరే మార్గం లేదని తేల్చిచెప్పింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎల్లుండి (సోమవారం) అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు రావడం ఖాయమైంది. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో కోర్టుకు వస్తుండటంతో అక్కడ భారీ ఎత్తున అభిమానులు, ప్రేక్షకులు గుమిగూడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సినిమా ప్రమోషన్స్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, దాని వల్ల జరిగిన అవాంఛనీయ సంఘటనలపై నమోదైన కేసులో ఈ విచారణ జరగనుంది. ఈ మొదటి విచారణ అనంతరం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశంపై ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun physical appearance in court
  • Nampally court
  • Sandhya Theater Stampede Case

Related News

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd