Konda Surekha: రాహుల్ గాంధీ ర్యాలీలో అపశ్రుతి, కొండా సురేఖకు గాయాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. బైక్ ర్యాలీలో పాల్గొన్న కొండా సురేఖకు గాయాలయ్యాయి.
- Author : Balu J
Date : 19-10-2023 - 6:11 IST
Published By : Hashtagu Telugu Desk
Konda Surekha: ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం విధితమే. అయితే ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉదయం భూపాలపల్లికి చేరుకున్న రాహుల్‌కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ కూడా పాల్గొన్నారు.
అయితే కొండా సురేఖ స్కూటీ నడుపుతున్న సమయంలో అదుపుతప్పడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో ఆమెకు ముఖంతో పాటు చేతులపై స్పల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడివారు వెంటనే కొండా సురేఖను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు పెద్దగా గాయాలుకాకపోవడంతో కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ర్యాలీలో పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో రాహుల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
Also Read: KTR: రాహుల్ జీ కాళేశ్వరంను సందర్శించండి, పసలేని విమర్శలు మానుకోండి: కేటీఆర్