HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rahul Ji Visit Kaleshwaram Project Avoid Useless Criticism Ktr

KTR: రాహుల్ జీ కాళేశ్వరంను సందర్శించండి, పసలేని విమర్శలు మానుకోండి: కేటీఆర్

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి.

  • Author : Balu J Date : 19-10-2023 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KT Rama Rao
Telangana Minister KTR America Tour

KTR: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు సెటైర్స్ వేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై  తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

‘‘రాహుల్ జీ..  దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ. మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి. దేశ సాగునీటి రంగ చరిత్రలోనే.. అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండి. సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసిపట్టి.. బొట్టుబొట్టును ఎలా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లిస్తున్నామో అర్థం చేసుకోండి. నీళ్లు పల్లమే కాదు.. బలమైన సంకల్పం ఉంటే… ఎత్తుకు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోండి. పాతాళంలో ఉన్న గోదావరి నీటిని.. ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటర్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి’’ కేటీఆర్ సెటైర్స్ వేశారు.

‘‘మొగులు వైపు చూసే దిగులు లేకుండా.. లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి. కాంగ్రెస్ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూడండి… చూసి నేర్చుకోండి. అరవై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో.. అన్నదాతను అరిగోస పెట్టినందుకు.. సాగునీటి కోసం నిత్యం సావగొట్టినందుకు.. తెలంగాణ రైతుకు బేషరతుగా క్షమాపణలు చెప్పండి. 80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులో.. లక్ష కోట్ల అవినీతి అని..  అర్థంలేని ఆరోపణలు చేసినందుకు అక్కడే గట్టిగా లెంపలేసుకోండి. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా.. కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి..సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని మీరు మరో వంద జన్మలెత్తినా సాధించలేరని ఇప్పటికైనా ఒప్పుకోండి’’ అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.

Also Read: Jr NTR: జయహో జూనియర్, ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచిలో ఎన్టీఆర్ కు సభ్యత్వం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hard comments
  • kaleshwaram project
  • ktr
  • rahul gandhi

Related News

PM Modi Becomes Most-Followed World Leader With Over 30 Million Subscribers

యూట్యూబ్‌లోనూ ప్రధాని మోదీ రికార్డు

Narendra Modi  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ఆయన చానెల్ 3 కోట్ల (30 మిలియన్ల) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటింది. దీంతో ప్రపంచంలోని ప్రస్తుత, మాజీ దేశాధినేతల్లో యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన నేతగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఈ ఘనతతో డిజిటల్ కమ్యూనికేషన్‌ల

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd