Congress : రేపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
- Author : Sudheer
Date : 21-12-2023 - 1:34 IST
Published By : Hashtagu Telugu Desk
పార్లమెంట్ (Parliament) లో బిజెపి (BJP) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ.. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar) తెలిపారు. పార్లమెంట్‌లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం.. సభలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు మహేష్ తెలిపారు. పొగ బాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే లోక్ సభ, రాజ్యసభలలో ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని చెప్పారు. రేపు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతారని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
Read Also : Lok Sabha Incident : లోక్సభలో దుండగుల హల్‌చల్ ఘటన.. పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ కొడుకు