HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Confusion In Brs Ktr Phoned Sunil Rao

KTR Phoned Sunil Rao: బీఆర్ఎస్‌లో క‌ల‌వ‌రం.. పార్టీ మారొద్దంటూ సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్‌?

పార్టీ మార్పుపై క‌రీంన‌గర్ జిల్లా మేయ‌ర్ సునీల్ రావు క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులతో నాకు ఎలాంటి విభేదాలు లేవని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

  • Author : Gopi Date : 25-01-2025 - 10:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Phoned Sunil Rao
KTR Phoned Sunil Rao

KTR Phoned Sunil Rao: తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఇప్ప‌టికే 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైంది. అప్ప‌ట్నుంచి ఆ పార్టీ నుంచి వ‌ల‌స‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆ త‌ర్వాత 2024లో జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఒక సీటు కూడా సాధించ‌కుండా అవ‌మానం ఎదుర్కొంది. దీంతో పార్టీలో కీల‌క నేత‌లు పార్టీని వీడి కాంగ్రెస్‌, బీజేపీల్లో చేరుతున్నారు. ఇదే కోవ‌లో తాజాగా కరీంన‌గ‌ర్ జిల్లా మేయ‌ర్ సునీల్ రావు కూడా బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్‌?

కరీంనగర్ జిల్లా మేయర్ సునీల్ రావు రాజీనామాతో బీఆర్ఎస్‌ అలర్ట్ అయింది. మేయర్ సునీల్ రావును బీఆర్ఎస్‌ అధిష్టానం బుజ్జ‌గించే ప‌నిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పార్టీ మారొద్దంటూ సునీల్ రావుకు కేటీర్ ఫోన్ (KTR Phoned Sunil Rao) చేసిన‌న‌ట్లు స‌మాచారం. నేడు బీజేపీలో చేరేందుకు సునీల్ రావు రంగం సిద్ధం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న కార్పొరేటర్ల‌తో స్థానిక‌ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ స‌మావేశ‌మై పార్టీ మార‌వ‌ద్దు అంటూ కీల‌క సూచ‌న‌లు ఇచ్చారు.

Also Read: National Voters’ Day : ఓటు వేయడం అమూల్యమైన హక్కు మాత్రమే కాదు మన కర్తవ్యం కూడా అని మర్చిపోవద్దు..!

బీఆర్ఎస్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మేయ‌ర్‌

పార్టీ మార్పుపై క‌రీంన‌గర్ జిల్లా మేయ‌ర్ సునీల్ రావు క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులతో నాకు ఎలాంటి విభేదాలు లేవని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వలనే కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్ర‌మంత్రి, ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ పార్టీ పరంగానే విమర్శలు చేశాన‌ని అన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు త‌న‌తో కలిసి బీజేపీలోకి వస్తారని ఆయ‌న బ‌హిరంగంగా స్టేట్మేంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో త‌న‌పై దుష్ప్రాచారం చేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చ‌రించారు. కరీంనగర్ నగర అభివృద్ధే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నాను అంటూ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • ktr
  • Mayor Sunil Rao
  • MP Bandi Sanjay Kumar
  • telangana politics
  • telugu news

Related News

Iran and the US sign peace agreement.

US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి. ప్రస్తుత సాంకేతికతను వాడుకుంటూ పూర్తి డిజిటల్ విధానంలో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తయినట్లు ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఈ కీలక పరిణామంతో ప్రస్తుతానికి ఇరు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

Latest News

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd