Drugs : డ్రగ్స్ విషయంలో సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..
- By Sudheer Published Date - 07:11 PM, Sat - 16 December 23

డ్రగ్స్ (Drugs ) విషయంలో సీఎం రేవంత్ (CM Revanth) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్‌తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. టిఆర్ఎస్ పాలన వల్ల రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి దాడులేనని, సింగరేణి కాలనీలో పసిపాపపై గంజాయి మత్తులో లైంగిక దాడి జరగడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణలో దొరుకుగుతున్న డ్రగ్స్ కు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. డ్రగ్స్ కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసి, ఆ అధికారిని అర్ధాంతరంగా ఎక్కడికి పంపించారని ప్రశ్నించారు. విచారణలో లోపాలను బయటపెట్టడానికి గతంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ (Hyderabad)లో విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం కొనసాగిందని, ఆ విషయంలో తెలంగాణ పంజాబ్‌ను మించిపోయిందని ఆరోపించారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ పెడ్లర్స్ తమ షెల్టర్ జోన్‌గా మార్చుకున్నారని విమర్శించారు. డ్రగ్స్ నిర్మూలనకు తాము ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఈ విషయంలో పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
డ్రగ్స్ నిర్మూలన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని.. డ్రగ్స్‌తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని రేవంత్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇకనుంచి ఎవరైనా హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకురావాలంటే కాళ్లు వణకాలని కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వెనుక ఎంతటివారు ఉన్నా ఉపేక్షించేది లేదని అన్నారు. ఇక రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసిందే తమ ప్రభుత్వమని గుర్తు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అదనపు పోలీస్ డైెరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ వంటి సమర్థుడైన అధికారిని దీనికి చీఫ్‌గా నియమించామని పేర్కొన్నారు. తొమ్మిది నెలల కిందటే అన్ని జిల్లాల పోలీస్ సూపరింటెండెట్లతో ఓ పకడ్బందీగా యాంటీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు.
Read Also : Nirbhaya Father: మోడీ ప్రభుత్వంపై నిర్భయ తండ్రి షాకింగ్ కామెంట్స్