Telangana: బిగ్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్
మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జితేందర్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. డీకే అరుణకు ఆ స్థానం కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 02:02 PM, Thu - 14 March 24

Telangana: లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ సమకారణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. తెలంగాణలో బలమైన పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ ప్రస్తుతం డీలా పడినట్టు కనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలోకి భారీగా చేరికల పర్వం కొనసాగుతుంది.
కాంగ్రెస్ లోకసభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సారి కనీసం 13 స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలను కూడా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడం రాజకీయంగా హీట్ పుట్టించింది. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జితేందర్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. డీకే అరుణకు ఆ స్థానం కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ మారేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సీఎం, పార్టీలో జితేందర్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారట.
బిగ్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ #jithenderreddy #RevanthReddy #CongressParty #Telangana #HashtagU pic.twitter.com/IvGfzDnr5n
— Hashtag U (@HashtaguIn) March 14, 2024
Also Read: Kurnool MP Sanjeev Kumar : టీడీపీ లో చేరిన వైసీపీ ఎంపీ ..