Chalo Raj Bhavan : మీరు ప్రజల వైపు ఉన్నారా..? అదానీ వైపు ఉన్నారా..? : సీఎం రేవంత్ రెడ్డి
అదానీని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మోడీ కాపాడినా అమెరికా మాత్రం వదిలిపెట్టదన్నారు.
- By Latha Suma Published Date - 02:57 PM, Wed - 18 December 24

Chalo Raj Bhavan: మణిపూర్ అల్లర్లు, అదానీ పై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు “చలో రాజ్‌భవన్” చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్, కవిత ఎవరి వైపు అని ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకొని అరెస్టుల నుంచి తప్పించుకున్నారు. మీరు ప్రజల వైపు ఉన్నారా..? అదానీ వైపు ఉన్నారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు రెడీ అంటే అసెంబ్లీలో తీర్మాణం చేద్దామన్నారు.
నిరసన ర్యాలీ చేస్తున్న మమ్మల్ని హైదారాబాద్ పోలీసులు అడ్డుకున్నారు అందుకే రాజ్ భవన్ చేరుకోలేక పోయాము మేం చేస్తున్న నిరసన కొందరికి కడుపు నొప్పి తెప్పించవచ్చు రాజ్ భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి #RevanthReddy #Congress #Leaders #Protest #GautamAdani #ISSUE #rajbhavan #HashtagU pic.twitter.com/XusJggBqyV
— Hashtag U (@HashtaguIn) December 18, 2024
అదానీ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలా..? వద్దా..? అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ని ప్రశ్నించారు. అదానీని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మోడీ కాపాడినా అమెరికా మాత్రం వదిలిపెట్టదన్నారు. ప్రజా స్వామ్యాన్ని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. జేపీసీలో చర్చించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కానీ కేంద్రం స్పందించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అదానీ సంస్థలు లంచాలు ఇచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇది మన దేశ గౌరవానికి భంగం కలిగించడమే.. అదానీపై విచారణ జరగాలన్నారు.
అదానీ, ప్రధాని మోడీ దేశం పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదానీ అంశం పై ప్రధాని మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ లో దీనిపై నిలదీసినా కేంద్రం స్పందించడం లేదు. కాంగ్రెస్ దేశం పరువు, ప్రతిష్టలను కాపాడుతుంటే.. మోడీ, అదానీ పరువు తీస్తున్నారని సీఎం పేర్కొన్నారు. మోడీ, కేసీఆర్ వేర్వేరు కాదు. ఇద్దరూ నాణేనికి బొమ్మాబొరుసు. బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ది ఉంటే అదానీ పై జేపీసీకి డిమాండ్ చేయాలి. ఆ పార్టీ కోరితే శాసనసభలో చర్చకు అనుమతిస్తాం. అదానీ అవినీతిపై జేపీసీ కోసం సభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం అన్నారు. దీనిపై అవసరం అయితే రాష్ట్రపతి భవన్ వద్ద కూడా నిరసన తెలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ముఖ్యమంత్రి రాజ్ భవన్ కి పిలుపునివ్వడం ఏంటి..? అని కొందరూ ప్రశ్నిస్తున్నారు. మా నిరసన కొందరికీ నచ్చకపోవచ్చు. అయిన కూడా అదానీ పై జేపీసీ విచారణ జరపాలని సీఎం డిమాండ్ చేశారు.
Read Also: Ambedkar : అబద్దాలతో ఆ పార్టీ అంబేద్కర్‌ను అవమానిస్తుంది : ప్రధాని మోడీ