CM Revanth Reddy : ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి భేటి
CM Revanth Reddy : రాష్ట్రంలో ఫాక్స్ కాన్ కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని వారిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
- By Latha Suma Published Date - 08:32 PM, Mon - 14 October 24

Foxconn Company : సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి వెళ్లిన రేవంత్.. సంస్థ పురోగతిపై అక్కడి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Read Also: Heavy Rainfall Alert: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు..?
ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని వారిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశం ఉన్న ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ ప్రతినిధులను కోరారు. కొంగరకలాన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ విభాగం ఉన్నతాధికారులు, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కాగా, 2023లో ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణకు వచ్చింది. కొంగరకలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటు చేయాలని ఫాక్స్ కాన్ నిర్ణయించింది. దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్ లియు వెల్లడించారు.