HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Japan Visit Aims At Investments

CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన

ఈ పర్యటనలో భాగంగా టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పో లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరగనుంది.

  • Author : Latha Suma Date : 16-04-2025 - 3:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy Japan visit aims at investments
CM Revanth Reddy Japan visit aims at investments

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా జపాన్ చేరుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటినుండే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ స్థాయిలో పెట్టుబడులు అవసరమన్న దృక్పథాన్ని వ్యక్తపరిచిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఈ పర్యటనలో భాగంగా టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పో లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరగనుంది.

Read Also: Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌.. నేపథ్యమిదీ

తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి వ్యాపారవేత్తలను, వివిధ సంస్థలను ఆహ్వనించనున్నట్లు తెలుస్తుంది. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై జపాన్ వెళ్లిన సీఎం బృందం అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు.

కాగా, ఏప్రిల్ 21న ఒసాకాలో నిర్వహించనున్న వరల్డ్ ఎక్స్‌పో – 2025లో తెలంగాణకు కేటాయించిన పవిలియన్‌ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే రోజు ఒసాకాలో బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఇక, సీఎం రేవంత్ హిరోషిమాకు చేరుకుని పీస్ మెమోరియల్ సందర్శించనున్నారు. అక్కడ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌లతో భేటీ అవుతారు. సుమిదా రివర్‌ ఫ్రంట్‌, మౌంట్ ఫుజీ, అరకురయామా పార్క్, కిటాక్యూషు సిటీ ఎకో టౌన్ ప్రాజెక్టులు, ఎన్విరాన్‌మెంట్ మ్యూజియం, మురసాకి రివర్ మ్యూజియం లాంటి ప్రాజెక్టులను సందర్శించి సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను అధ్యయనం చేయనున్నారు.

Read Also: BJP : ఈ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్‌ ఏటీఎంగా వాడుకున్నారు : బీజేపీ

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Investments
  • Japan Tour
  • Osaka
  • World Expo - 2025

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd