HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Justice Br Gavai Will Be The Next Cji Of The Supreme Court This Is His Background

Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌.. నేపథ్యమిదీ

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌(Justice BR Gavai) మహారాష్ట్రలోని అమరావతి వాస్తవ్యులు.

  • By Pasha Published Date - 03:10 PM, Wed - 16 April 25
  • daily-hunt
Justice Br Gavai Next Cji Chief Justice Of India Supreme Court

Justice BR Gavai:  సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌  నియమితులు కానున్నారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌ను నియమించాలంటూ ఇటీవలే కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనకు వెంటనే కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. దీంతో తదుపరి సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌ను నియమించేందుకు మార్గం సుగమం అయింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పదవీకాలం మే 13తో ముగియనుంది.

ఆరు నెలలే సీజేఐ హోదాలో.. 

జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబరులోనే పదవీ విరమణ చేయనున్నారు. అంటే కేవలం ఆరు నెలల పాటే భారత ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ సేవలు అందిస్తారు. 2007లో మన దేశ సీజేఐగా దళిత వర్గానికి చెందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదోన్నతి పొందారు. మళ్లీ ఇప్పుడు ఆ అత్యున్నత న్యాయపదవిని పొందిన రెండో దళిత మేధావిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌ నిలిచారు.

Also Read :Dogs Crematorium : ఇక కుక్కలు, పిల్లులకూ శ్మశానవాటిక.. సర్వీసుల వివరాలివీ

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌ నేపథ్యం.. 

  • జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌(Justice BR Gavai) మహారాష్ట్రలోని అమరావతి వాస్తవ్యులు.
  • ఆయన 1985లో బార్‌ అసోసియేషన్‌లో చేరారు.
  • మహారాష్ట్ర హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్, న్యాయమూర్తి బారిస్టర్ రాజా భోంస్లేతో  జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌  కలిసి పనిచేశారు.
  • 1987 నుంచి 1990 వరకు బాంబే హైకోర్టులో ఆయన స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
  • రాజ్యాంగ చట్టం, పరిపాలనా చట్టానికి సంబంధించిన విషయాలలో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఎదుట ప్రాక్టీస్ చేశారు.
  • 1992 ఆగస్టులో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆయన నియమితులయ్యారు.
  • 2000లో నాగ్‌పూర్ బెంచ్‌కు ప్రభుత్వ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌ నియమితులయ్యారు.
  • ఆయన 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
  • 2019 సంవత్సరంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో జస్టిస్ గవాయ్ అనేక చారిత్రక తీర్పులలో భాగమయ్యారు.
  • కేంద్ర సర్కారు 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఈయన ఉన్నారు.
  • ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోనూ ఈయన ఉన్నారు.

Also Read :Aurangzebs Tomb: ఔరంగజేబ్ సమాధిపై ఐరాసకు మొఘల్ వారసుడి లేఖ.. ఎవరతడు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CHief Justice Of India
  • Justice BR Gavai
  • New CJI
  • next cji
  • Supreme Court

Related News

Four years of locality mandatory for medical students: Supreme Court

Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచ్ ఇచ్చిన పూర్వపు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో, స్థానికత నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు లభించింది.

  • E20 Fuel Policy

    E20 Fuel Policy: సుప్రీంకోర్టుకు చేరిన E20 ఇంధన విధానం.. అస‌లు ఈ20 ఇంధ‌నం అంటే ఏమిటి?

Latest News

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd