TS : రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఖరారైంది: మాల్లారెడ్డి
- By Latha Suma Published Date - 05:47 PM, Tue - 21 May 24

Mallareddy: మేడ్చల్ జిల్లా సుచిత్ర(Suchitra) పరిధిలోని తన భూమి కబ్జా విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి స్పందించారు. రేపు తనకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అపాయింట్ మెంట్(Appointment) ఖరారైందని, ఈ భుమి వ్యవహారాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని, ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాలతో తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే సుచిత్రలోని భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు తన వద్ద ఉన్నాయని ఆ డాక్యుమెంట్లు ఫేక్ అని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని..అలాగే లక్ష్మణ్ వద్ద ఉన్న పత్రాలు సరైనవని నిరూపించలేకపోతే ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని మల్లారెడ్డి సవాల్ విసిరారు.
Read Also: Incharge VCs : పది యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలు.. ఐఏఎస్‌లకు బాధ్యతలు
కాగా, మాల్లారెడ్డి ఇటివల మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని తన భుమిని కబ్జా చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వ సర్వే కూడా ముగిసింది. అయినప్పటికీ, మాజీ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సర్వే నెంబరు.82లోని 2.5 ఎకరాల భూమి మాదంటే మాదని ఇరువురు వాదిస్తున్నారు.