HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Apologises After Sc Fumes Over Remark On K Kavitha Bail

CM Revanth Reddy: సుప్రీం కోర్టుకు సారీ చెప్పిన సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్‌ కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య జరిగిన డీల్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించాయి. కోర్టుకు క్షమాపణలు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాను మాట్లాడిన మాటలను న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టుగా వక్రీకరించారని++++

  • Author : Praveen Aluthuru Date : 30-08-2024 - 2:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy Apology
CM Revanth Reddy Apology

CM Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసినందుకు సంబంధించిన పత్రికా కథనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా విచారం వ్యక్తం చేశారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత గౌరవం ఉందని, దానిపై పూర్తి విశ్వాసం ఉందని సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాను మాట్లాడిన మాటలను న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టుగా వక్రీకరించారని, ఆయా పత్రికల్లో తనపై లేనిపోని ఆరోపణలు చేశారని సీఎం రేవంత్ సుప్రీంకు తెలిపారు.

“భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యున్నత గౌరవం మరియు పూర్తి విశ్వాసం ఉంది. పత్రికా నివేదికలలో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. న్యాయవ్యవస్థ మరియు దాని స్వతంత్రత పట్ల నాకు బేషరతుగా గౌరవం ఉందని సీఎం చెప్పారు. భారత రాజ్యాంగం మరియు దాని నీతిపై దృఢంగా విశ్వసించే వ్యక్తిగా, నేను న్యాయవ్యవస్థను దాని అత్యున్నత గౌరవాన్ని కొనసాగిస్తున్నాను అని ఆయన X లో పోస్ట్ చేశారు.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుల్లో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరు చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగస్టు 29వ తేదీ గురువారం సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్‌ కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య జరిగిన డీల్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించాయి. “ఇది ఒక సిఎం స్థాయి వ్యక్త చేయవలసిన ప్రకటనా, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు మేము బెయిల్ ఇస్తామా అంటూ” అని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటి ప్రకటనలు ప్రజల మనస్సులలో భయాందోళనలను కలిగిస్తాయని అన్నారు. అయితే తన ఆదేశాలపై వచ్చిన విమర్శల వల్ల ఇబ్బంది లేదని కోర్టు పేర్కొంది. మా మనస్సాక్షి ప్రకారం మేము మా కర్తవ్యం నిర్వర్తిస్తాం. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ధర్మాసనం పేర్కొంది.చట్టసభల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకపోతే తమ నుంచి కూడా అదే జరుగుతుందని బెంచ్ ఘాటుగా వ్యాఖ్యానించింది.

Also Read: Vistara – Air India: విస్తారా – ఎయిర్‌ ఇండియా విలీనంకు కేంద్రం ఆమోదం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • apology
  • CM Revanth Reddy
  • kavitha bail
  • Supreme Court
  • telangana
  • telugu news

Related News

Telugu States IRCTC Special Trains

తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

Telugu States IRCTC Special Trains  తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయ

  • Minister Uttam Holds High L

    Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

  • Telangana Agriculture

    ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

  • Supreme Court stays Telangana HC order Movie Ticket Prices

    సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

Latest News

  • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

  • Meta layoffs: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. మెటాలో 16 వేల మంది ఉద్యోగులు లేఆఫ్

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd