CM Revanth : హైడ్రా విధివిధానాలపై అధికారులకు సీఎం రేవంత్ సూచనలు
హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు.
- Author : Latha Suma
Date : 12-07-2024 - 7:02 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్) పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా విధివిధానాలపై చర్చ జరిగింది. హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగించాలి. అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలని ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్‌లో వచ్చేలా జాగ్రత్త వహించాలన్నారు. నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసులా అధ్యయనం చేయండని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలి. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించండి. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించండని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు.
Read Also: Chandrababu : రేపు ముంబైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు