HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Furious Over Meenakshi Natarajan Incident

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 10-06-2026 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth furious over Meenakshi Natarajan incident.
CM Revanth furious over Meenakshi Natarajan incident.

మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ పార్టీ ‘సీట్ల దొంగతనానికి’ పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల దొంగతనం తర్వాత ఇప్పుడు బీజేపీ సీట్ల దొంగతనానికి దిగిందని ఆరోపించారు. తెలంగాణకు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కేసుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో పొందుపరచలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మధ్యప్రదేశ్‌లో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.

ఈ వ్యవహారంపై జైరాం రమేష్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ప్రయత్నించగా, వారిని అడ్డుకున్నారని సమాచారం. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కాంగ్రెస్ అంతర్గత నేతలే తమకు అందించారని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఒకరు చెప్పడం గమనార్హం. మరోవైపు, ప్రతిపక్షాలను అణచివేసి, దేశంలో ఏక పార్టీ పాలనను స్థాపించడానికే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM A Revanth Reddy
  • congress party
  • Madhya Pradesh
  • Meenakshi Natarajan
  • Rajya sabha nomination

Related News

Modi Pm

PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును మోదీ అధిగమించనున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. జూన్ 10 నాటికి

  • D.K. Shivakumar Sworn In as Karnataka Chief Minister

    DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: Chandrababu Responds to Pawan's Meeting in Telangana

    CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

Latest News

  • TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా

  • Alia Bhatt: ఆలియా భట్ యాక్షన్ విధ్వంసం.. ఆల్ఫా టీజర్ రిలీజ్

  • Bharathiraja: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు

  • Social Media: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. 15 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు

  • Yellow Teeth: పసుపు దంతాలకు అసలు కారణం ఇదే.. ఇలా చేస్తే మెరిసిపోవాల్సిందే

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd