HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Comments Kishan Reddy

Praja Palana Sabha : కిషన్ రెడ్డి తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే – సీఎం రేవంత్

Praja Palana Sabha : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్‌(Gujarat)కు వెళ్లిపోవాని సూచించారు. గుజరాత్‌ గులాంను అని చెప్పుకునే కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదని విమర్శించారు

  • Author : Sudheer Date : 19-11-2024 - 8:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Revant Vs Kishan
Cm Revant Vs Kishan

కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభలో(Praja Palana Sabha ) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజెపి , బిఆర్ఎస్ పార్టీల నేతల పై విరుచుకపడ్డారు. కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు లనే కాదు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ లను కూడా వదిలిపెట్టలేదు. ఎప్పటిలాగానే తన మాటల తూటాలను వదులుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

కేసీఆర్ (KCR) తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిని , మళ్లీ గడ్డమీద కేసీఆర్ మొక్కను మొలవనివ్వనని, రాహుల్​ గాంధీని చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలి. ఒక్కసారి ఓడిస్తే.. మళ్లీ ప్రజల మొహం చూడవా? అధికారం ఇస్తే దోచుకోవటం.. ఓడిస్తే ఫామ్​హౌజ్​లో దాచుకోవటం. ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావటం లేదు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదు. మూడుసార్లు అధికారం దక్కపోయినా.. రాహుల్​ గాంధీ ప్రజల మధ్యే ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం సూచనలు ఎందుకు చేయట్లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్‌(Gujarat)కు వెళ్లిపోవాని సూచించారు. గుజరాత్‌ గులాంను అని చెప్పుకునే కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదని విమర్శించారు. అసలు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. ఒక్కసారి కాదు.. పదిసార్లు ఆమె కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకున్నా తప్పులేదని కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఊడిగం చేస్తున్నారని, తెలంగాణ పట్ల చిత్తశుధ్దిలేదన్నారు. గుజరాత్ లో సబర్మతి సుందరీకరణను సమర్థించి.. తెలంగాణలో మూసీ సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాళోజీ నారాయణ రావు బతికి ఉంటే కేసీఆర్‌(KCR), కిషన్ రెడ్డిలను తెలంగాణ నుంచి తరిమివేసే వారని అన్నారు.

Read Also : Praja Vijayotsava Sabha : తాగుబోతుల సంఘానికి కేసీఆర్ అధ్యక్షుడు – సీఎం రేవంత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • kishan reddy
  • Praja palana sabha
  • warangal

Related News

    Latest News

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

    • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

    Trending News

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd