HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Asked Kcr To Come To Assembly Meetings

Telangana Assembly : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరిన సీఎం రేవంత్

Telangana Assembly : ప్రజాసమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఆయన హాజరు కావడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు

  • Author : Sudheer Date : 05-12-2024 - 1:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Revanth Asked Kcr To Com
Cm Revanth Asked Kcr To Com

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం (Telangana Assembly Sessions To Start From December 9 ) కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ను అసెంబ్లీకి హాజరుకావాలని కోరారు. ప్రజాసమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఆయన హాజరు కావడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్‌ను సమావేశాలకు ఆహ్వానిస్తారని రేవంత్ తెలిపారు. ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం మంచిది కాదని, సభలో వాస్తవ సమస్యలపై చర్చ జరిగేలా కేసీఆర్ తన పూర్వానుభవంతో సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. తాము అందరూ కేసీఆర్ కంటే జూనియర్ ఎమ్మెల్యేలు కాబట్టి ఆయన పెద్దరికాన్ని చూపాలని రేవంత్ అన్నారు. సభలో ప్రతిపక్ష నేతగా ఆయన అనుభవం అందరికీ ఉపయుక్తమవుతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన హాజరు కావడం ప్రజాస్వామ్యానికి మంచిదని రేవంత్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు సభలో ప్రవర్తనపై కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

పిల్లలు తప్పు చేస్తుంటే పెద్దలు ఆపాలని, కానీ ఇక్కడ రాక్షసులను తయారు చేసి ఉసిగొల్పడమే జరుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇది ప్రజల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాసమస్యల పరిష్కారానికి ఒక గొప్ప వేదిక అని, అందువల్ల ప్రతిపక్ష నేతల పాత్ర కీలకమని రేవంత్ స్పష్టం చేశారు. సభలో చర్చ జరిగేలా ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా కేసీఆర్ తన బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. ఈనెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసారు. తొమ్మిదో తేదీ ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.

ఈ సమావేశాల్లో ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్‌ పవర్‌ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదిక, ఫోన్‌ట్యాపింగ్ తదితర అంశాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Read Also : Indiramma Houses Survey App : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే ప్రయారిటీ : సీఎం రేవంత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • kcr
  • Telangana Assembly Sessions

Related News

Good News for the People of Telangana: New Pensions—Starting From When?

New Pensions: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త పెన్షన్లు.. ఎప్పటి నుంచంటే..?

తెలంగాణలో జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త పింఛన్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. నిరుద్యోగుల కోసం మిర్యాలగూడ, నకిరేకల్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు జర్మనీలో 5 లక్షల ఉద్యోగాల సాధన కోసం టామ్‌కా

    Latest News

    • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

    • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

    • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

    • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    Trending News

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd