HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Closed Colleges

Fee Reimbursement : మూతపడిన కళాశాలలు

Fee Reimbursement : ప్రభుత్వం డిమాండ్లను అంగీకరిస్తే సమ్మెను విరమిస్తామని, లేనిపక్షంలో మంగళవారం నుంచి బంద్ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు

  • Author : Sudheer Date : 15-09-2025 - 2:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Collages Bandh
Collages Bandh

తెలంగాణలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపుపై వివాదం కొనసాగుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం వృత్తివిద్యా కాలేజీ యజమాన్యాల సంఘం (FATHI) చేపట్టిన విద్యాసంస్థల బంద్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఆదివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరుల సమక్షంలో జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.

ప్రస్తుతం కళాశాలలకు పెండింగ్‌లో ఉన్న టోకెన్ల బకాయిలు రూ.12 వందల కోట్ల వరకు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించింది. వీటిని తక్షణం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అయితే ఏ కళాశాలకు ఎంత మొత్తంలో బకాయిలు ఉన్నాయనే వివరాలను సేకరించేందుకు ఆర్థిక శాఖ అధికారులు ఒక రోజు గడువు కోరారు. దీంతో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్‌లో మళ్లీ చర్చలు జరపాలని నిర్ణయించారు.

Aqua Farmers : ట్రంప్ దెబ్బకు అల్లాడిపోతున్న ఆక్వా రైతులు

ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (FATHI) నాయకులు ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానంపై ఆధారపడి తమ భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరిస్తే సమ్మెను విరమిస్తామని, లేనిపక్షంలో మంగళవారం నుంచి బంద్ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో తరగతులు జరగవని స్పష్టంచేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఫార్మసీ, బీఎడ్‌ పరీక్షల విషయంలో యాజమాన్యాలు, విశ్వవిద్యాలయాల సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సాయంత్రం జరగబోయే సమావేశం ద్వారా సమస్యకు పరిష్కారం దొరకాలని అందరూ ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Congress Govt
  • fee reimbursement
  • Telangana Private Colleges Bandh

Related News

Good news for farmers from the Revanth government.

CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చడంతో పాటు, పంటల సాగు విధానంలో సమతుల్యతను సాధించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా.. మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చిరుధాన్యాల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఇతర ధాన్యాల దిగుమతి విషయంలో తెలంగాణను స్వయం సమృద్ధి దిశగా నడిపించే

    Latest News

    • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

    • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

    • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

    • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

    • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd