Lok Sabha Elections 2024: జహీరాబాద్ ఎంపీ బరిలో చెరకు కరణ్ రెడ్డి.. తప్పకుండా విజయం సాధించాలంటూ?
పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను మోహరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తుండగా, మరోవైపు చాలామంది నేతలు ఎంపీలుగా వారీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 09:59 PM, Thu - 1 February 24

Lok Sabha Elections 2024: పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను మోహరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తుండగా, మరోవైపు చాలామంది నేతలు ఎంపీలుగా వారీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఉన్న జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారిలో ముఖ్యమైన నేత చెరుకు కరణ్ రెడ్డి.. ఆధ్యాత్మిక వేత్తగా.. జర్నలిస్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పరిచయమే.

Cheruku Karan Reddy
అయితే కరణ్ రెడ్డికి ఈ విషయంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా కరుణ్ రెడ్డి కి గత రెండు దశాబ్దాలుగా బిజెపి పార్టీతో ప్రత్యేక అనుబంధం ఉంది అన్న విషయం తెలిసిందే. పార్టీలో క్రియాశీల పాత్ర పోషించే కరణ్ రెడ్డి కరడు గట్టిన హిందుత్వ వాది,హిందువులకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా హిందుత్వానికి ఎలాంటి ఆపద వచ్చినా అందరికంటే ముందు నిలుస్తారు కరణ్. శారదాపీఠం స్వరూపానందేద్ర సరస్వతి స్వామి వారికి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచార యాత్ర కోఆర్డినేటర్ గా 7500 కిలో మీటర్లు నడిచారు. అంతేకాకుండా వెయ్యికి పైగా ఆలయాలను కూడా సందర్శించారు. కాగా కరణ్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని.
కాగా ఆయన జర్నలిస్టుగానూ సుప్రసిద్ధులు. అనేక మీడియా సంస్థల్లో పని చేసిన కరణ్ రాజకీయ వ్యూహకర్తగానూ ఎంతో మంది నాయకులను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించారు. తెలంగాణలో పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ కి సైతం పార్టీ స్థాయిలోనూ వ్యూహరచనలో పాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్నట్లు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక జర్నలిస్టుగా, ఆధ్యాత్మిక వేత్తగా ప్రజా సేవకుడిగా రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితులైన కరణ్ ను త్వరలో ఎంపీగా పార్లమెంటులో చూడాలని ఆయన తప్పకుండా విజయం సాధించాలని చాలామంది కోరుకుంటున్నారు.
Also Read: Eyebrows: కనుబొమ్మలు అందంగా పెరగాలంటే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?