Chalamala Krishnareddy : బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి..రాజగోపాల్ ఫై పోటీ..?
- Author : Sudheer
Date : 01-11-2023 - 4:43 IST
Published By : Hashtagu Telugu Desk
అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్స్ అంత పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , బిజెపి (BJP) , కాంగ్రెస్ (Congress) ఇలా అన్ని పార్టీలలో ఇలా అసమ్మతి సెగలు నడుస్తున్నాయి. ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తే..పార్టీ మాకు కాదని వేరే వల్ల కు, కొత్తగా పార్టీలో చేరిన వారికీ టికెట్ ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వారికీ ఎవరైతే పార్టీ టికెట్ ఇస్తుందో అందులో చేరుతున్నారు. తాజాగా మునుగోడు కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి (Chalamala Krishnareddy) సైతం పార్టీ మారబోతున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోసం గత కొద్దీ రోజులుగా ఎదురుచూస్తూ వస్తున్నాడు. తనకే టికెట్ అని చెప్పుకొచ్చారు. కానీ అధిష్టానం మాత్రం తనకు కాకుండా కాంగ్రెస్ లో తిరిగి చేరిన రాజగోపాల్ రెడ్డి కి ఇవ్వడం తో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన బిజెపి లో చేరి మునుగోడు నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈయన తో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఎడవల్లి సుభాష్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరాలని ఆ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో వారు ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కీలక సమయంలో పార్టీని వదిలేసి వెళ్లిన రాజగోపాల్ రెడ్డిపై (Komatireddy Rajagopal Reddy) బలమైన అభ్యర్థిని దించి సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
Read Also : Pre-Election Cash : అభ్యర్థుల నామినేషన్స్ షురూ కాలేదు అప్పుడే రూ.400 కోట్లు సీజ్..