CBN : రేపు గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబు కృతజ్ఞత సభ.. భారీగా తరలిరానున్న ఐటీ ఉద్యోగులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 50 రోజులుగా రాజమండ్రి
- Author : Prasad
Date : 28-10-2023 - 6:54 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. అయితే చంద్రబాబుకు మద్దతుగా వివిధ వర్గాల వారు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచే ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు, బిల్డింగ్స్ వద్ద ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్ధతుగా ఆందోళన నిర్వహించారు. బ్లాక్ డ్రెస్‌లతో ఆఫీసులకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఇటు మెట్రో రైల్‌లో కూడా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బ్లాక్ డ్రెస్‌లతో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఐటీ ఉద్యోగులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబుకు కృతజ్ఞతగా భారీ సభను ఏర్పాటు చేశారు. రేపు(ఆదివారం) సాయంత్ర 4గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ సభ జరగనుంది. సభకు సంబంధిచి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. దాదాపు లక్ష మందిపైగా ఈ సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఐటీలో తాము చేస్తున్న ఉద్యోగాలు నాడు చంద్రబాబు ఐటీని అభివృద్ధి చేయడం వల్లే వచ్చాయని టెక్కీలు తెలిపారు. దీనికి చంద్రబాబుకు కృతజ్ఞతగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read: TDP : ప్రభుత్వానిది ధనబలం.. మాది ప్రజాబలం.. శ్రీకాళహస్తిలో ‘నిజం గెలవాలి’ సభలో నారా భువనేశ్వరి