Two People Died: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. నగరంలోని బంజారాహిల్స్ లో ఆదివారం నాడు కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి (Two People Died) చెందారు. ఆదివారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన కారు (Car) అదుపుతప్పి రోడ్డుపక్కన టిఫిన్ చేస్తున్న ఇద్దరిపై నుండి దూసుకెళ్లింది.
- By Gopichand Published Date - 09:55 AM, Sun - 1 January 23

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. నగరంలోని బంజారాహిల్స్ లో ఆదివారం నాడు కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి (Two People Died) చెందారు. ఆదివారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన కారు (Car) అదుపుతప్పి రోడ్డుపక్కన టిఫిన్ చేస్తున్న ఇద్దరిపై నుండి దూసుకెళ్లింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అప్పటికీ ఆగని కారు ఆగిఉన్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.
Also Read: Three Died: తెలంగాణలో తీవ్ర విషాదం.. ఆటోపై గ్రానెట్ రాయి పడి ముగ్గరు మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మద్యం సేవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో కారును నడిపినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును మద్యం మత్తులో నడిపినట్టుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.