Budget 2024 : బడ్జెట్ లో మరోసారి తెలంగాణకు మొండిచేయి
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యం లభించడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి
- By Sudheer Published Date - 01:54 PM, Tue - 23 July 24

తెలంగాణ (Telangana) ప్రజలకు మరోసారి కేంద్రం మొండిచేయి చూపించింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman) ప్రకటించిన బడ్జెట్ 2024-25లో (Union Budget) తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్తో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది.కానీ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం ఫై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యం లభించడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేత సాయాన్ని (Funds to AP in Union Budget) అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సమర్థత, పవన్ కళ్యాణ్ వల్లే కేంద్రం ఈ నిధులిచ్చిందని కొనియాడుతున్నాయి. ‘విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది లేదు. వ్యూహాత్మకంగా ఎన్డీయేలో చేరడం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ద్వారా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు తమ మార్కు రాజకీయం చూపించారు’ అంటూ ఇరు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Union Budget : కొత్త INCOME TAX స్లాబ్స్ ఇవే..