HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Will Regain Power In The Coming Days Kcr

KCR : రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దే : కేసీఆర్‌

బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.

  • Author : Latha Suma Date : 22-03-2025 - 6:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS will regain power in the coming days: KCR
BRS will regain power in the coming days: KCR

KCR : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ చేపట్టిన పాదయాత్ర గోదావరిఖని నుంచి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందంతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సంపన్నంగా ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధపడుతున్నారని అన్నారు. పదేళ్లు పచ్చగా ఉన్న తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంల చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్‌ఎస్‌దే అని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.

Read Also: Anantapur : నీటి భద్రతను సాధ్యం చేస్తోన్న అల్ట్రాటెక్ సిమెంట్

తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని పేర్కొన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్‌ల తయారు కావాలన్నారు. కాంగ్రెస్‌ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి లేకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వాళ్లు కాదని తెలిపారు. బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.

రామగుండంలో పరిస్థితులుపై మాట్లాడిన కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే సమస్యలు చుట్టు ముట్టాయని తెలిపారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. చాలా విషయాల్లో కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చినా తాను వెనకడుగు వేయలేదన్నారు. భవిష్యత్‌లో చాలా పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణ హక్కుల కోసం నిలబడాలని పేర్కొన్నారు. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని తర్వాత ఇందిరాగాంధీ మోసం చేశారని కేసీఆర్‌ ఆరోపించారు.

Read Also: Delimitation : దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు: కేటీఆర్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • brs
  • chandrababu
  • congress
  • kcr
  • Korukanti Chander
  • padayatra
  • telangana

Related News

Vip Break Darshan For 116 Y

TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

ఆమె భక్తి పట్ల స్పందించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

  • Case Registered Against You

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

  • Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

  • Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • TCS నాసిక్‌లో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి కేసులో నిందితురాలైన మహిళకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  • Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd