HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Legislator Maganti Gopinath Is No More

Maganti Gopinath: ఎవ‌రీ మాగంటి గోపినాథ్‌.. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణం ఇదే!

మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 2014, 2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

  • Author : Gopichand Date : 08-06-2025 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maganti Gopinath
Maganti Gopinath

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) తెలుగు రాష్ట్రాల్లో కీల‌క రాజ‌కీయ నేత‌గా పేరుపొందారు. టీడీపీతో త‌న రాజ‌కీయ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టిన ఆయ‌న ఆ త‌ర్వాత అప్ప‌టి టీఆర్ఎస్ (ప్ర‌స్తుత బీఆర్ఎస్‌)లో చేరి వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోపినాథ్‌ సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూత‌

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం (జూన్ 8) ఉదయం 5:45 గంటలకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, జూన్ 5న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఈరోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు.

Also Read: Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 2014, 2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా.. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.

2018లో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) తరపున 16,004 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డిపై గెలుపొందారు. 1985లో హైద‌రాబాద్ న‌గ‌ర తెలుగు యువ‌త అధ్య‌క్షుడిగా ఎంపిక‌య్యారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయ‌న తర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్‌లో చేరారు. అంతేకాకుండా ఆయ‌న బీఆర్ఎస్ త‌ర‌పున 2022లో హైద‌రాబాద్ జిల్లా అధ్య‌క్షుడిగాను ప‌నిచేశారు. గోపినాథ్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ప్ర‌ముఖులు సంతాపం

ఆయన మరణం పార్టీకి తీరని లోటని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీలు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌, తదితరులు ఆయన మరణానికి సంతాపం తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS MLA
  • hyderabad
  • Jubilee Hills MLA Gopinath
  • Maganti Gopinath
  • tdp
  • telangana

Related News

Uber Driver Booked For Obsc

Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

గచ్చిబౌలి పరిధిలో ఒక మహిళ ఉబెర్ రైడ్ బుక్ చేసుకోగా, సదరు డ్రైవర్ నాగరాజు ఆమెకు అత్యంత అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి మానసిక వేధింపులకు గురిచేశాడు

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Petrol Shortage Full Demand

    Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

Latest News

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

  • H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd