Telangana: బీఆర్‌ఎస్‌లో మూకుమ్మడిగా రాజీనామాలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌కు షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు కేసీఆర్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 18-10-2023 - 6:39 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌కు షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు కేసీఆర్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
తాజాగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ తగిలింది. పార్టీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. బయ్యారం మండలానికి చెందిన 9 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఉప సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు, ఐదుగురు పీఏసీఎస్ డైరెక్టర్లు, పలువురు వార్డు సభ్యులు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారందరూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు జిన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read: Chaturgraha Yoga – October 19 : రేపే చతుర్గ్రహ యోగం.. మూడు రాశుల వారికి అదృష్ట యోగం