Balmuri Venkat: సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై ఫిర్యాదు
Balmuri Venkat: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- By Kavya Krishna Published Date - 04:49 PM, Thu - 12 June 25

Balmuri Venkat: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం పరువును కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం నిరాధారమనీ, చట్టపరంగా దానిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాళేశ్వరం జల ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన నేపథ్యంలో, మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వెంకట్ ఆరోపించారు. అదే తరహాలో, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై ఇలా విమర్శలు చేయడం తగదని బల్మూరి వెంకట్ అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా సీఎం పరువును దిగజార్చేలా వ్యవహరించారని ఆరోపిస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించనున్నారు.
Air India Flight Crash : అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో కూలిన ఎయిర్ ఇండియా విమానం..