HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Leader Harish Rao Fire On Cm Revanth Reddy

BRS Leader Harish Rao: లక్ష తప్పుడు కేసులు పెట్టించినా.. నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను: హరీష్ రావు

మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.

  • Author : Gopi Date : 03-12-2024 - 4:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS Leader Harish Rao
BRS Leader Harish Rao

BRS Leader Harish Rao: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు చాలా హాట్ హాట్‌గా కొన‌సాగుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (BRS Leader Harish Rao) పైన పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ తో కలిసి తన ఫోన్లు ట్యాపింగ్ లకు పాల్పడ్డారని, తనపై అక్రమ కేసులు బనాయించి, మానసికంగా వేధించారని కూడా సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పంజాగుట్ట పోలీసులు.. 120(బి), 386, 409, 506, రెడ్ విత్ 34 , ఐటీ యాక్ట్ చట్టాల కింద కేసు నమోదైంది.

Also Read: Taj Mahal : తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. ముమ్మర సోదాలు

మిస్టర్ @revanth_anumula

అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.

నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం,…

— Harish Rao Thanneeru (@BRSHarish) December 3, 2024

మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు అని ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డు మీద ఈకలు పీకి, తలా తోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను అని ట్వీట్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • harish rao
  • hyderabad
  • Punjagutta police station
  • siddipeta
  • telangana
  • telugu news
  • ts politics

Related News

Kavitha Jayalalitha

TRS : కేసీఆర్ పై మాట మార్చిన కవిత..!!

రాష్ట్ర రాజకీయాల్లో ఈ తండ్రీకూతుళ్ల పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుంటే, కవిత మాత్రం పాత 'టీఆర్ఎస్' (తెలంగాణ రక్షణ సేన) పేరుతో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో బలపడాలని చూస్తున్నారు

  • Liquor Price

    Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

  • Phone Recharge suicide Live-in relationship Jeedimetla hyderabad

    Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..

  • Telangana Government Announces 2BHK Homes for HYDRA Victims

    HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

  • CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

    పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

Latest News

  • Chhattisgarh : IED పేలి ముగ్గురు జవాన్లు మృతి

  • Dr. Bhaskar Jyoti Sonowal : గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడిగా డాక్టర్ భాస్కర్ జ్యోతి సోనోవాల్ ఏకగ్రీవం

  • Movie Shooting : తమిళనాడు లో షూటింగ్స్ బంద్.. ఎందుకంటే?

  • Klook : పర్యాటకులకు క్లూక్ బంపర్ ఆఫర్..ఫరా ఖాన్‌తో కలిసి సింగపూర్‌ను చుట్టేయండి!

  • Amazon Prime Day : జూలైలో అమెజాన్ ప్రైమ్ డే 2026 ..ఆఫర్సే ఆఫర్స్

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd