BRS 2023 Manifesto Public Talk : బిఆర్ఎస్ మేనిఫెస్టో ఫై పబ్లిక్ టాక్..
ప్రధానంగా మహిళలు, రైతులకు మాత్రమే ఎక్కువ మ్యానిఫేస్టోలో పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఫై ఏమాత్రం దృష్టి సారించలేదు
- By Sudheer Published Date - 12:02 PM, Mon - 16 October 23

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (TRS) రెండుసార్లు అధికారం చేపట్టింది. అనేక సంక్షేమ పథకాలను అందజేసి ప్రజల మెప్పు పొందింది. ఈసారి కూడా అలాంటి సంక్షేమ పథకాలతో ప్రజలు మనసులు గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల తాలూకా మేనిఫెస్టో ను గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) నిన్న ఆదివారం ప్రకటించారు. మొన్నటి వరకు అందరి దృష్టి బిఆర్ఎస్ మేనిఫెస్టో (BRS 2023 Manifesto ) ఫైన ఉంది.
ఊరించిన బిఆర్ఎస్ మేనిఫెస్టో
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలను (TS Congress 6 Guarantee schemes) చూసి ప్రజల్లో నమ్మకం పెరుగగా..దీని తలదన్నే రీతిలో బిఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతుందని , బ్రహ్మాండం బద్దలయి పోతుందని , ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీల మొహాలు మాడిపోతాయని…కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. వీరి మాటలు చూసి అబ్బా మేనిఫెస్టో ఎప్పుడెప్పుడు విందామా..చూద్దామా అంటూ రాష్ట్ర ప్రజలే కాక ఇతర పార్టీల నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూడడం చేసారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ఉండే వ్యతిరేకతను ఎదుర్కొనడానికి కేసీఆర్ అన్ని వర్గాల మీద వరాల జల్లు ప్రకటిస్తారని భావించారు. కానీ కేసీఆర్ మాత్రం అందరి ఆశలపై నీళ్లు చల్లాడు. సొంత పార్టీ నేతలు సైతం మేనిఫెస్టో ఫై పెదవి విరుస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుతో పోల్చుకుంటే గులాబీ కార్డు మాత్రం వెలవెలపోయిందన్న అంటున్నారు.
ఉచితాల జోలికి పోనీ కేసీఆర్
ఈసారి మేనిఫెస్టో లో కేసీఆర్ పెద్దగా ఉచితాల జోలికి పోలేదు. కొత్త పథకాల ఫై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఉన్న వాటినే కొంత నగదు సాయాన్ని పెంచారు. అది కూడా దశలవారీగా అమలు చేస్తామని చెప్పి కొంత నిరాశకు గురి చేశారు. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండి రాష్ట్ర ఖజానా పరిస్థితి తెలిసి ఆయన ఈ విధంగా వ్యవహరించారా..? అన్న అనుమానం మ్యానిఫేస్టో చూసిన వారికి ఎవరికైనా కలుగుతుంది. ప్రధానంగా మహిళలు, రైతులకు మాత్రమే ఎక్కువ మ్యానిఫేస్టోలో పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఫై ఏమాత్రం దృష్టి సారించలేదు. ఉద్యోగుల జీతాలు కానీ , జాబ్స్ కానీ వీటిపై ఏమాత్రం స్పందించలేదు. కేవలం పెన్షన్లు , రైతులనే దృష్టి లో పెట్టారని అంటున్నారు. యువత మాత్రం కేసీఆర్ మేనిఫెస్టో ఫై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ఆకట్టుకునే ప్రయత్నించారు తప్పించి ప్రధాన ఓటర్లైన యువత పట్ల నిర్లక్ష్యం వహించాహ్రాని అంటున్నారు. దళిత బంధును ప్రస్తావించిన కేసీఆర్ బీసీ బంధు గురించి మాత్రం పెద్దగా చెప్పలేదు. తనపై నమ్మకం ఉంచి మరోసారి గెలిపించమని కోరారు తప్పించి.. ప్రత్యేకించి తాను మరోసారి అధికారంలోకి వస్తే ఈసారి ఈ కొత్త పథకాన్ని తాను తెస్తానని మాత్రం కేసీఆర్ ప్రకటించలేదని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆకట్టుకున్న కాంగ్రెస్ హామీలు
కాంగ్రెస్ ఇచ్చినట్లు తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత కరెంట్, నిరుద్యోగులకు హామీ, రైతు భరోసా ఏటా పదిహేను వేలు, వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు సాయం, వరి పై ప్రతి క్వింటాల్ కు ఐదు వందల బోనస్ వంటి వాటిపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని , కాంగ్రెస్ ఇంటి నిర్మాణాలకు ఐదు లక్షలు, ఉద్యమ కారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, పింఛను నెలకు నాలుగు వేలు, ఆరోగ్య శ్రీ పదిలక్షలకు వరకూ పెంచుతామని చెప్పింది. డిసెంబరు 9వ తేదీన తాము ఆరు గ్యారెంటీలపై సంతకం చేస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే కేసీఆర్ మాత్రం విడతల వారీగా ఇస్తామని చెప్పారని అంటున్నారు. ఓవరాల్ గా బిఆర్ఎస్ మేనిఫెస్టో కన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో నే బాగుందని అంటున్నారు. మరి అనడం వరకేనా..ఓట్ల రూపంలో వారి నిర్ణయాన్ని చెపుతారా అనేది చూడాలి.
బిఆర్ఎస్ మేనిఫెస్టో హైలైట్స్ (BRS Manifesto HIGHLIGHTS):
- సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ. 3 వేల గౌరవ వేతనం
- దివ్యాంగులు పెన్షన్లు రూ. 6 వేలకు పెంపు
- ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంపు
- రైతుబంధు కింద ఇస్తున్న రూ.10 వేల నగదు సాయాన్ని 16 వేలకు పెంపు (అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో రూ.12 వేలు.. ఆ తర్వాత క్రమంగా పెంపు)
- బీసీలకు అమలు చేస్తున్న పథకాలు అలాగే కొనసాగింపు
- దళితబందు పథకం యథావిధిగా కొనసాగింపు
- గిరిజనేతరులకు కూడా పోడు భూములు ఇచ్చే అంశం పరిశీలిస్తాం.
- ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షల పెంపు
- అర్హులైన వారందరికీ రూ. 400కే సిలిండర్, అక్రిడేషన్ ఉన్న జర్మలిస్టులకు కూడా రూ. 400కే సిలిండర్
- తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం
- ‘కేసీఆర్ బీమా ప్రతి ఇంటిటి ధీమా’ పేరుతో రూ. 5 లక్షల బీమా పథకం (93 లక్షల మందికి లబ్ధి)
- హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు
- ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ డిమాండ్‌పై కమిటీ ఏర్పాటు
- లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలను చేస్తాం.
- అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి భూ హక్కులు
- ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు (Congress 6 Promises in Telangana) చూస్తే..
1. మహాలక్ష్మి
ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
రూ.500లకే గ్యాస్ సిలిండర్
రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం
2. రైతు భరోసా
ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం
ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం
వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన
3. గృహజ్యోతి
ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం
4. ఇందిరమ్మ ఇళ్లు
ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం
5. యువ వికాసం
విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు , స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సాయం.
ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు
6. చేయూత
పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను
ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం
Read Also : Ponnala Lakshmaiah : కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. పొన్నాల రాంగ్ స్టెప్ వేశాడా..?