Ponnala Lakshmaiah : కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. పొన్నాల రాంగ్ స్టెప్ వేశాడా..?
కేసీఆర్ నమ్మి చాలామంది అలాగే బిఆర్ఎస్ లో చేరారు. వీరిలో కొంతమందికి మేలు జరుగగా..మరికొంతమందికి నిరాశే మిగిలింది.
- By Sudheer Published Date - 11:11 AM, Mon - 16 October 23

మరో 45 రోజుల్లో తెలంగాణ ఎన్నికల పోలింగ్ (Telangana Elections) జరగనున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల పోరు గట్టిగా ఉండబోతుంది. ముఖ్యంగా బిఆర్ఎస్ vs కాంగ్రెస్ (BRS Vs Congress) ల మధ్య పోరు జరగనుంది. ఈ టైములో కాంగ్రెస్ పార్టీ కి పొన్నాల రాజీనామా (Ponnala Lakshmaiah resign congress) చేసి రాంగ్ స్టెప్ వేశాడని అంత మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల్లో కేసీఆర్ (KCR) దిట్ట అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కేసీఆర్ వేసే ఎత్తుగడలు మాములుగా ఉండవు. మొన్నటి వరకు ఓ లెక్క ఇక నుండి ఓ లెక్క అన్నట్లు ప్రజల మనసులు మార్చేస్తాడు. అంతే కాదు ఇతర పార్టీల నేతలకు కూడా అలాంటి ఆశలే చూపు వారిని లాక్కుంటుంటారు. కేసీఆర్ నమ్మి చాలామంది అలాగే బిఆర్ఎస్ లో చేరారు. వీరిలో కొంతమందికి మేలు జరుగగా..మరికొంతమందికి నిరాశే మిగిలింది.
We’re now on WhatsApp. Click to Join.
మొన్న మండవ వెంకటేశ్వరరావు (Mandava Venkateswara Rao).. నిన్న మోత్కుపల్లి నరసింహులు (Motkupalli Narasimhulu) ఎలాగైతే నిరాశకు గురయ్యారో… ఇప్పుడు పొన్నాల కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని అంత మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు గౌరవం ఇవ్వలేదని, తనను కలిసేందుకు కూడా అనుమతించలేదని పొన్నాల ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడారు. నిన్న ఆదివారం ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు. నేడు జనగామలో జరిగే కేసీఆర్ బహిరంగ సభలో ఆయన అధికారికంగా పార్టీలో చేరతారని సమాచారం. అయితే పొన్నాలకు జనగాం టికెట్ ఇస్తారనే ప్రచారం జరగడం తో అంత అందుకే ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి , బిఆర్ఎస్ లో చేరబోతున్నారని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం జనగాం బిఆర్ఎస్ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఇచ్చారు. మరి ఇప్పుడు పొన్నాలకు ఏ టికెట్ ఇస్తారు..? అసలు టికెట్ ఇస్తారా లేదా..? అనేది అంత మాట్లాడుకుంటున్నారు.
అసలు కాంగ్రెస్ పార్టీ లోనే పొన్నాల ఉంటె బాగుండేదని, అసలు ఆయనకు టికెట్ ఇవ్వరని ఎవరు అన్నారని అంత ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే పొన్నాల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇతర పార్టీల నేతలను వాడుకుంటారని..పొన్నాలకు తెలియదా..? పార్టీ లోచేరే ముందు మాత్రమే ప్రగతి భవన్ లోకి పొన్నాలకైనా.. ఏ నేతకైనా అనుమతి ఉంటుంది. ఆ తంతు పూర్తయిన తర్వాత అంతే సంగతి అని గుర్తు చేస్తున్నారు. హుజారాబాద్ లో ఈటెల ను ఓడించేందుకు పాడి కౌశిక్ రెడ్డి, ఎల్. రమణ వంటి వారిని బిఆర్ఎస్ లోకి తీసుకున్నారని , ఆ తర్వాత వారికీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ,అదే టైములో పెద్దిరెడ్డి చేరినా ఆయనకు ఏమాత్రం ప్రయోజనం దక్కలేదని అంటున్నారు. ఆలాగే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కమ్యునిస్టు పార్టీలతో జత కట్టారని , ఆ తర్వాత వారిని పక్కకు పెట్టారని , దీంతో వారు ఈసారి కాంగ్రెస్ తో జత కట్టారని…ఇలా ఇవన్నీ చూసి కూడా పొన్నాల ఎలా కేసీఆర్ ను నమ్మడని కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. మరి పొన్నాలకు కేసీఆర్ ఛాన్స్ ఇస్తారా..? లేక వాడుకొని వదిలేస్తారా..? అనేది చూడాలి.
Read Also : BRS Manifesto: బీఆర్‌ఎస్ మేనిఫెస్టోకు విలువ లేదు