Telangana: మార్చి మొదటి వారంలో బీజేపీ లోక్‌సభ తొలి జాబితా
తెలంణగణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా హీట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పీపనిలో ఉన్నాయి.
- By Praveen Aluthuru Published Date - 07:58 AM, Thu - 22 February 24
Telangana: తెలంణగణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా హీట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ రాష్ట్ర నాయకత్వం పంపిన అభ్యర్థుల జాబితాపై బీజేపీ అధిష్టానం ఏకాభిప్రాయానికి రావాల్సిన దృష్ట్యా అభ్యర్థుల తొలి జాబితాను మార్చి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
జనవరి చివరి వారంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు అది జరగలేదు. రాష్ట్ర నాయకత్వం పంపిన పేర్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతృప్తి చెందలేదని, అభ్యర్థుల బలాలు, బలహీనతలు, వివిధ రంగాల్లో పార్టీకి ఉన్న అవకాశాలను అంచనా వేసేందుకు ఆయన బృందం ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో గరిష్ఠ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో అమిత్ షా ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని భావించినట్లు సమాచారం. షా సొంతంగా ఓ సర్వే టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందం స్థానిక నాయకులకు ఎలాంటి సమాచారమే ఇవ్వదు. ఎలాంటి పక్షపాతం చూపించదు.
Also Read:Kodangal: కొడంగల్‌లో రూ.4,369.143 కోట్ల అభివృద్ధి పనుల వివరాలు