Bhatti Vikramarka Mallu : ప్రతిపక్ష నాయకులపై భట్టి ఆగ్రహం
bhatti vikramarka mallu : రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి
- By Sudheer Published Date - 12:06 PM, Mon - 13 January 25

కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే రైతుబంధు పథకం (Rythu Bandhu Scheme) ఇవ్వదంటూ అనేక రకాలుగా దుష్ప్రచారం చేసిన ప్రతిపక్షాల పై ఉప ముఖ్యమంత్రి భట్టి (Bhatti Vikramarka Mallu) ఆగ్రహం వ్యక్తం చేసారు. తమది ప్రజా ప్రభుత్వం అని , రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరువేరుస్తున్నామని , ఇప్పటికే పలు హామీలు నెరవేర్చమని భట్టి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకం కింద పెట్టుబడిని పదివేలు నుండి 12వేల రూపాయలకు పెంచడం, రైతులకు ఇచ్చిన గొప్ప హామీని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం
భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీల కోసం, ముఖ్యంగా ఆర్థికంగా విసిగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ పథకం ద్వారా 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఏడాదికి అందేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్నదని భట్టి తెలిపారు.
ఉచిత కరెంటు – రైతులకు పెద్ద ఉపకారం
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అందిస్తున్న ఉచిత కరెంటు సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తుంది. విద్యుత్తు శాఖకు 12 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించడం ద్వారా, రైతులపై ఎలాంటి అదనపు ఆర్ధిక భారాలు పడకుండా చూడటమే లక్ష్యం. గృహ జ్యోతి పథకం కింద ప్రతి అర్హత గల కుటుంబం 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నాం. 2023 మార్చి 1 నుండి దీనిని అమల్లోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం చెల్లించే విధంగా, పంట బీమా, రైతు బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ఇది రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న మరో కీలక చర్య. ఇలాంటి సంక్షేమ పథకాలు రైతుల జీవితాలను ఆర్ధికంగా నిలబెడతాయి అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన ప్రతిపక్ష నాయకుల చెంపలు చెల్లుమనే విధంగా రైతు భరోసా పెట్టుబడి పదివేల నుంచి 12 వేలకు పెంచుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు ఇవ్వబోతున్నది
రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి… pic.twitter.com/phHzp0GFAj
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 12, 2025