HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Watched Balagam Movie At Rtc Cross Roads

Bandi Sanjay: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బలగం సినిమా చూసిన బండి సంజయ్

బలగం సినిమా ప్రభంజనం కొనసాగుతుంది. ఎక్కడ చూసినా బలగం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఓటిటిలోకి వచ్చినా దాని ప్రభావం తగ్గడం లేదు.చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

  • Author : Hashtag U Date : 10-04-2023 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay watched Balagam movie at RTC Cross Roads
Bandi

Bandi Sanjay : బలగం సినిమా ప్రభంజనం కొనసాగుతుంది. ఎక్కడ చూసినా బలగం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఓటిటిలోకి వచ్చినా దాని ప్రభావం తగ్గడం లేదు.చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్ళకి కట్టినట్లు చూపించడంలో దర్శకుడు, నటుడు వేణు సక్సెస్ అయ్యాడు. అయితే తాజాగా బలగం సినిమాను వీక్షించారు తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో బలగం సినిమా చూశారు ఎంపీ బండి సంజయ్. ఈ రోజు మధ్యాహ్నం.. బండి సంజయ్ (Bandi Sanjay) తోపాటు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు 200 మంది, మరియు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధియేటర్ లో సినిమా చూశారు.

తెలంగాణ పల్లె వాతావరణం ఆధారంగా తెరకెక్కిన బలగం సినిమా చూసి ప్రతి ఒక్కరు కంటతడిపెడుతున్నారు. విడిపోయిన ఎన్నో బంధాలు మళ్ళీ కలుసుకున్నాయి. సినిమాలో చూపించిన విధంగా కుటుంబాల మధ్య ప్రేమలు, అనురాగాలు కరువయ్యాయి. ఎవరికి వారే అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కానీ బలగం సినిమా అందర్నీ ఆలోచింపజేసింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఓటిటిలోను స్ట్రీమింగ్ అవుతుంది. తెలంగాణలోని పల్లెల్లో ఈ సినిమాను తెర మీద ప్రదర్శిస్తున్నారు. ఊర్లో వాళ్ళు సినిమా చూసి కన్నీరుపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో బంధాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారు.

బలగం సినిమాలో ప్రియదర్శి, చైల్డ్ ఆర్టిస్ట్ వల్లంకిపిట్ట ఫేమ్ కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలను పోషించారు.. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ సహా ఎంతో మంది అద్భుతమైన నటనతో అలరించారు.

Also Read:  High Court: హైకోర్టు సంచలనం, మేజిస్ట్రేట్ పై విచారణకు ఆదేశం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balagam
  • Bandi Sanjay
  • bjp
  • cinema
  • Cross Roads
  • hyderabad
  • movie
  • rtc
  • RTC Cross Roads
  • telangana
  • tollywood

Related News

Pandu Master Health Update

Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. డ్యా

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

  • Eggs Benefits: ఉడికించిన కోడిగుడ్లు తింటే గుండె సమస్యలు రావా..?

  • Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

  • Kuwait Airport: అమెరికా-ఇరాన్ యుద్ధం..కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి

  • TDP vs YSCP : మావిగన్ జగన్‌కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd