High Court: హైకోర్టు సంచలనం, మేజిస్ట్రేట్ పై విచారణకు ఆదేశం
మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ పై విచారణ చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాన్ని జారీ చేసింది. ఏపీ హైకోర్ట్ సంచలన నిర్ణయం కింది కోర్టులను ఆలోచింప చేస్తుంది.
- Author : CS Rao
Date : 10-04-2023 - 3:24 IST
Published By : Hashtagu Telugu Desk
High Court Sensational Order : మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ పై విచారణ చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాన్ని జారీ చేసింది. ఏపీ హైకోర్ట్ సంచలన నిర్ణయం కింది కోర్టులను ఆలోచింప చేస్తుంది. మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన వివరణ పై సంతృప్తి చెందని హైకోర్టు, ఆయనపై దర్యాప్తు చేయాలి అంటూ గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించిటంతో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. సహజంగా మొన్నటి వరకు పోలీసుల తీరు పైనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చేది. అయితే మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ పై ఈ రోజు హైకోర్టు (High Court) అసంతృప్తి వ్యక్తం చేయటం, విచారణకు ఆదేశించటం సరి కొత్త పరిణామం. వివరాల్లోకి వెళ్తే టిడిపి నేతను బ్రహ్మం చౌదరిని పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
ఈ సందర్భంగా బ్రహ్మం చౌదరి, పోలీసులు తనని కొట్టారు అంటూ మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ముందు చెప్పుకున్నారు. ఆ గాయాలు కూడా కోర్టుకు చూపించారు. అతని స్టేట్మెంట్ అయితే మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ రికార్డ్ చేసారు కానీ, అతన్ని వైద్య పరీక్షలకు పంపకుండా, విడుదల చేయకుండా, రిమాండ్ వేయటం పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బ్రహ్మం చౌదరి హైకోర్టుకు వెళ్ళారు. ఇక ఇదే సమయంలో బ్రహ్మం చౌదరికి, 41 ఏ నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసారని, తన పైన పెట్టిన కేసులు అన్నీ, ఏడేళ్ళ లోపు కేసులు అని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నోటీస్ ఇవ్వాల్సి ఉందని, కోర్ట్ కు తెలిపారు.
నోటీస్ ఇచ్చి, విచారణ చేసి పంపించి వేయాలని, ఒక వేళ నోటీస్ ఇచ్చిన తరువాత అరెస్ట్ చేయాలి అంటే, మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాల్సి ఉందని, అవేమి లేకుండానే పోలీసులు అరెస్ట్ చేసారని, నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయటమే కాకుండా, కస్టడీలో కొట్టారు అంటూ బ్రహ్మం చౌదరి హైకోర్టుకు తెలిపారు. దీని పై హైకోర్టు (High Court) స్పందిస్తూ, మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ కు ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది. దెబ్బలు తగిలయాని చెప్తే, వైద్య పరీక్షలకు ఎందుకు పంపించలేదని ? 41 ఏ నోటీస్ విషయం కూడా ప్రశ్నించింది. ఇవన్నీ రికార్డులో రాసి కూడా, రిమాండ్ కు ఎందుకు తరలించాల్సి వచ్చిందో కోర్టుకు చెప్పాలని తెలిపింది.
దీని పై వివరణ కోరింది. కోర్టు ఆదేశాలు ప్రకారం మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ఈ రోజు వివరణ ఇవ్వగా, కోర్టు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. గుంటూరు జడ్జిని విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు కింద కోర్టు మెజిస్ట్రేట్ లు అందరూ, రొటీన్ గా రిమాండ్ వేయటం కాకుండా, కేసు మెరిట్స్ ప్రకారం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: Jupally : నా ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో ఉంటే తప్పేంటి? : జూపల్లి