Shock to BRS: కేసీఆర్ కు భారీ షాక్.. రాజీనామాకు సిద్దమైన ఆరూరి రమేష్
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలనుంది. బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
- By Praveen Aluthuru Published Date - 10:24 PM, Sun - 3 March 24

Shock to BRS: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలనుంది. బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితం బీజేపీ అగ్రనేతలు ఆయనను కలిశారని సమాచారం. గత కొంత కాలంగా పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని తన అనుచరులతో రమేష్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అగ్రనేతలు అరూరి రమేష్‌ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత రమేష్‌ను శాంతింపజేసే బాధ్యతను ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అప్పగించారు. కానీ ఆయనను బుజ్జగించేందుకు కడియం శ్రీహరి అంగీకరించలేదు. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను బీఆర్ఎస్ నాయకత్వం రంగంలోకి దించింది. బస్వరాజు పార్టీ మారకుండా అరూరి రమేష్‌ను శాంతింపజేస్తున్నారు.
అయితే రమేష్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రమేష్ కూడా పార్టీ మారుతుండడంతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది. వలసలు ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: PM Modi: 8 గంటల క్యాబినెట్ భేటీలో మోడీ కీలక నిర్ణయాలు