Army Jawan Suicide : జమ్మూకశ్మీరులో తెలంగాణ జవాన్ ఆత్మహత్య.. కారణమిదీ
సాంబా జిల్లాలో ఉన్న త్రీ మద్రాస్ యూనిట్‌లోని 168వ బ్రిగేడ్‌లో నాగరాజు(Army Jawan Suicide) సేవలు అందించేవారు.
- By Pasha Published Date - 10:36 AM, Tue - 20 May 25

Army Jawan Suicide : జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట. కుటుంబ సమస్యలతో మనస్థాపానికి గురై 28 ఏళ్ల సంపంగి నాగరాజు సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆదివారం రోజు (మే 18న) సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. నాగరాజు భౌతికకాయాన్ని కుటుంబీకులకు ఆర్మీ అధికారులు అప్పగించారు. కుటుంబ సమస్యల వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బంధువులు చెబుతున్నారు.
Also Read :Jr NTRs Birthday : జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. కెరీర్‌లోని కీలక ఘట్టాలివీ
సాంబా జిల్లా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం
సాంబా జిల్లాలో ఉన్న త్రీ మద్రాస్ యూనిట్‌లోని 168వ బ్రిగేడ్‌లో నాగరాజు(Army Jawan Suicide) సేవలు అందించేవారు. సాంబా జిల్లాలోని సరిహద్దు ఔట్‌పోస్ట్ సరోజ్ వద్దనున్న 125వ ఆర్మీ బెటాలియన్, బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి గస్తీ కాసే సెంట్రీ విధులను నాగరాజుకు అప్పగించారు. సరిహద్దు ఔట్‌పోస్ట్ సరోజ్ వద్ద సంపంగి నాగరాజు డెడ్‌బాడీ అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. శరీరంపై బుల్లెట్ గాయం ఉంది. బుల్లెట్ తగిలినందు వల్లే ఆయన చనిపోయారని తేలింది. ఆయన డెడ్‌బాడీని సాంబా జిల్లా పోలీసులు తొలుత పరిశీలించారు. అనంతరం భౌతిక కాయాన్ని సాంబా జిల్లా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు. ఈకేసుపై సాంబా జిల్లా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.