HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >And Mulugu Municipality Peoples Dream Fulfilled

Mulugu Municipality: ఇక ములుగు మున్సిపాలిటీ.. నెరవేరిన ప్రజల కల

రాష్ట్ర గవర్నర్ ను, రాష్ట్రపతిని కలిసి బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులో పలు లోపాలు ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు.

  • Author : Gopi Date : 04-01-2025 - 10:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mulugu Municipality
Mulugu Municipality

Mulugu Municipality: ములుగు ప్రజల సుదీర్ఘ స్వప్నం ఫలించింది. నూతన మున్సిపాలిటీగా ములుగు (Mulugu Municipality) అవతరించబోతోంది. ఇప్పటివరకు గ్రామపంచాయతీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ శనివారం నాడు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రక్రియ పూర్తి కాగానే ములుగు మున్సిపాలిటీగా అవతరించనుంది.

సెప్టెంబర్ 2022లోనే తెలంగాణ అసెంబ్లీ ములుగును మునిసిపాలిటీ చేస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా.. బిల్లు సరిగా లేకపోవడంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు. అప్పటి ప్రభుత్వం ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు చిత్తశుద్ధిగా పనిచేయలేదు. దీంతో గత రెండు సంవత్సరాలుగా ఈ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం నిర్వాకం వల్ల.. జిల్లా కేంద్రంగా ములుగు అవతరించినా.. మున్సిపాలిటీకి నోచుకోలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేశారు.

Also Read: Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన‌ తెలంగాణ ప్ర‌భుత్వం.. రైతు భరోసా రూ.12 వేలు!

రాష్ట్ర గవర్నర్ ను, రాష్ట్రపతిని కలిసి బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులో పలు లోపాలు ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీంతో మరోసారి ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ పాత బిల్లును రీ కాల్ చేస్తూ కేటినెట్ శనివారం నాడు ఆమోదం తెలపడంతో.. ములుగు మున్సిపాలిటీకి మార్గం సుగుమయ్యింది. ములుగు మున్సిపాలిటీ కల నెరవేరడంతో ములుగు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ములుగు మున్సిపాలిటీ కల సాకారానికి కృషి చేసిన మంత్రి సీతక్కకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అయితే ములుగు మున్సిపాలిటీగా చేయ‌డంతో అక్క‌డ అభివృద్ధికి మ‌రింత ఆస్కారం ఉండ‌నుంది. ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న కేబినెట్‌కు మంత్రి సీత‌క్క సైతం ధ‌న్య‌వాదాలు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • hyderabad
  • Minister Seethakka
  • mulugu
  • Mulugu Municipality
  • telangana
  • telangana news
  • telugu news

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd